పిఠాపురంలో ఒక్కడే పవన్ కళ్యాణ్... ఇక గెలుపే తరువాయా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం కంప్లీట్ అయింది. ఇక ఈ నామినేషన్ల ప్రాసెస్ లో భాగంగా పిఠాపురంలో అనేక చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. మన అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు కావడం , చాలా రోజులనుగా ఇక్కడే ఉంది మరి ప్రచారం చేస్తూ ఉండడం ఇలా అనేక కారణాల వల్ల ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఈ ప్రాంతంలో మంచి క్రేజ్ ఏర్పడింది.

దానితో పోయిన సారి రెండో స్థానాల్లో పోటీ చేస్తే రెండింటిలో ఓడిపోయిన పవన్ ఈ సారి కేవలం ఒకటే స్థానంలో పోటీ చేస్తున్నప్పటికీ దానిలో కచ్చితంగా గెలుస్తాడు అనే సంకేతాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజల నుండి వినిపిస్తుంది. దీనితో అక్కడి ఆపోజిట్ టీమ్ లు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న కొంతమంది ని వెతికి నామినేషన్లు వేయించారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కు కొణిదల అనే ఇంటి పేరు వస్తుంది. కొణిదల అని కాకపోయినా కే అనే ఇంటి పేరు వచ్చే కొంత మందిని వెతికి పట్టుకోవచి వారితో నామినేషన్లు వేసుకొచ్చిన వింత సంఘటన పిఠాపురం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇకపోతే ఇవన్నీ తొలి దశలోనే స్రుటినీ సందర్భంగా కొట్టుకపోయాయి.

చుట్ట చివరి నిమిషంలో నామినేషన్లు వేసిన కారణంగా వీటిని కొట్టివేశారు. ఇక దానితో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వారిలో కే పవన్ కళ్యాణ్ అనే పేరుతో సినీ నటుడు , జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. ఇక దీనితో ప్రత్యర్ధులు వేసిన ఎత్తులు చిత్తు కావడం వల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింతగా ఈ ప్రాంతంలో పెరిగింది అని , ఈసారి ఈయన కచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు అని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: