బిగ్ బాస్ ని తిట్టాడు.. ఇప్పుడు బయటకి వెళ్ళిపోతున్నాడు?

praveen
బిగ్ బాస్ హౌస్లో ఏం జరగబోతుంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా ఇదే ప్రశ్న.. తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ అనే రియాలిటీ షో ప్రారంభమైంది అంటే చాలు.. ఇక మిగతా షోలు అన్నింటిని పక్కన పెట్టేసి.. బిగ్ బాస్ చూడటానికి తెగ ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ఈ షోలో కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు.. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ కు పెట్టే టాస్కులు ఇలా అన్ని ఎంతో ఆసక్తికరంగా సాగిపోతూ ఉంటాయి. ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవ్వడం పై కూడా ఉత్కంఠ నెలకొంటూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే బిగ్ బాస్ హౌస్ లో రూల్స్ ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. బయట ఎంత లగ్జరీగా ఉన్నవారైనా సరే హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇక నిర్వాహకులు పెట్టే రూల్స్ తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎవరైనా రూల్స్ అతిక్రమించారు అంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటాడు బిగ్ బాస్. అలాంటిది ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో ఏకంగా నిర్వాహకుల పైనే నోరు పారేసుకున్నాడు ఒక కంటెస్టెంట్. అతను ఎవరో కాదు అభయ్. కిచెన్ లో వండుకోవడం విషయంలో బిగ్ బాస్ రూల్స్ పెట్టాడు. కేవలం ముగ్గురు మాత్రమేఅందరికీ వండి పెట్టాలి అంటు రూల్స్ పెట్టడంతో.. ఈ రూల్స్ పెట్టిన వాడు మనిషి పుట్టుకే పుట్టాడా అంటూ నోరు పారేసుకున్నాడు.

 ఆ తర్వాత ఎగ్ టాస్క్ పెట్టిన సమయంలో ఒక్కడికే రూల్స్ ఇచ్చి టాస్కులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు.. అసలు దిమాక్ ఉందా లేదా అంటూ మరోసారి బిగ్ బాస్ ని తిట్టేసాడు. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అభయ్ మాటలు నార్మల్గానే అనిపించినప్పటికీ.. అభయ్ ఎలా మాట్లాడాడు అన్న విషయం బయట ఉన్న ప్రేక్షకులకు కాస్త బాగానే అర్థమైంది. ఇక బిగ్ బాస్ కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యాడు. ఎవరికైనా హౌస్ లో ఉండడం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళండి అంటూ డోర్స్ కూడా ఓపెన్ చేయడం సంచలనంగా మారిపోయింది.

 అయితే ఇక ఇలా బిగ్ బాస్ ని తిట్టడమే కాదు అటు టాస్కుల్లో కూడా విఫలమై ఏకంగా క్లాన్ చీఫ్ పదవిని కూడా కోల్పోయిన అభయ్ నవీన్ ఈ వారం హౌస్ నుంచి బయటికి రాబోతున్నాడు అన్నది తెలుస్తోంది. అయితే ఓటింగ్ లో కూడా అతనికి తక్కువగానే మద్దతు లభించిందట. ఓటింగ్లో కూడా అతను లీస్ట్ లో ఉన్నాడు అన్నది తెలుస్తోంది. దీంతో ఈ వారం అభయ్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అని సమాచారం. ఒకవేళ ఓటింగ్లో కాస్త అటు ఇటు తేడా ఉన్న బిగ్ బాస్ ను తిట్టినందుకు ఇక నిర్వాహకులు అతని బయటికి పంపించే ఛాన్స్ కూడా ఉందని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: