బీజేపీలో టీడీపీ విలీనం...ముహూర్తం ఇదే ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు వివాదం కొనసాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... వైసిపి వర్సెస్ తెలుగుదేశం పార్టీల మధ్య తారస్థాయికి చేరింది. అయితే వైసీపీని విమర్శించేందుకు హిందూ సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగారు. తెలంగాణ బిజెపి ఎంపీలు బండి సంజయ్ ఇలాంటివారు కూడా చంద్రబాబుకు లేఖ రాసి మరి... ఈ విషయంపై స్పందిస్తున్నారు.
 అయితే తిరుమల శ్రీవారి ప్రసాదం పై వివాదం జరుగుతున్న సందర్భంగా... వైసీపీ రాజ్యసభ సభ్యులు  విజయ సాయి రెడ్డి.. కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ త్వరలోనే విలీనం కాబోతుందని... దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని రాజ్యసభ సభ్యులు  విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జమిలి ఎన్నికలు జరిగిన వెంటనే... ఈ ప్రక్రియ జరుగుతుందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది.
 ఆ భయంతోనే ముందుగా... వైసీపీ నేతలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తున్నాడని... విజయసాయిరెడ్డి వాదన. కోట్లు పెట్టి మరి వైసీపీ నేతలను చంద్రబాబు నాయుడు.. కొనుగోలు చేస్తున్నారని కూడా... సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. వంద రోజుల పాలన  సందర్భంగా తెలుగుదేశం ఎన్నికల కంటే ముందు ప్రకటించిన..  పథకాలను జనాలు అడుగు తారని... తిరుమల లడ్డు వివాదం తెరపైకి తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు.
 రాజకీయాలను పూర్తిగా డైవర్ట్ చేసేందుకు లడ్డు వివాదం తెర పైకి తీసుకు వచ్చి నాటకాలు వాడుతు న్నారని చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు విజయసాయిరెడ్డి. డైవర్ట్ చేసే రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు అలవాటేనని... అందుకే ఈ వివా దాన్ని తీసుకువచ్చాడని చెప్పారు. చంద్రబాబు నాటకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు.. గమనిస్తున్నారని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఈ 100 రోజుల పాలనలో టిడిపి నేతల మధ్య చాలా నియోజకవర్గాలలో గొడవలవుతున్నాయని కూడా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: