కాంగ్రెస్‌కు కొత్త అర్థం చెప్పిన కిషన్‌ రెడ్డి?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ పార్టీ బ్రిటీష్ వారసత్వాన్ని కొనసాగిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశం మీద రుద్దే ప్రయత్నం చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీని దేశ ప్రధాని కాకుండా భాజపా అడ్డుకువడం వల్లే మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేశారన్నారు. కాంగ్రెస్ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ గా మారిపోయిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. భారతదేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని.. దరిద్ర, ఇటలీ కాంగ్రెస్ ను దేశ ప్రజలు పదేళ్ల కింద వదిలించుకున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ మళ్ళీ వస్తే రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ వితండవాదం చేస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెంచారో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: