రోడ్డు ప్రమాదం.. బాలీవుడ్ బ్యూటీ మలైకాకు స్వల్ప గాయాలు..!

N.ANJI

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం పూణెలోని ఒక ఫ్యాషన్ ఈవెంట్‌కి హాజరైన మలైకా.. తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు మలైకా నుదిటిపై స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు సీటీ స్కానింగ్, తదితర పరీక్షలు నిర్వహించి.. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. ఈ రోజు ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు సమాచారం.


కాగా, ఈ ప్రమాదం ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగింది. ఖలాల్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మలైకా ప్రయాణిస్తున్న కారు ఫ్రంట్ కొంతమేరా ధ్వంసమైంది. అయితే మలైకా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె సోదరి అమృతా తెలిపారు. కాగా మలైకా కారు ప్రమాదానికి గురైందని తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు ఎంతో ఆందోళన చెందారు. ఆమె క్షేమంగా ఉందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.


కాగా, మలైకా అరోరా బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. అలాగే స్పెషల్ ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించారు. టాలీవుడ్‌లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించారు. ఈ ఐటెం సాంగ్ ద్వారా ఆమె టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు తగ్గినా.. షోలు, ఈవెంట్స్‌ లో జడ్జిగా కనిపిస్తున్నారు. అలాగే మలైకా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం తను చేసే యోగాసనాలు, వర్కౌట్స్, హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. అలా తనదైన శైలిలో మలైకా ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకున్నారు. కాగా, మలైకా హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇప్పుడు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: