లవ్ స్టోరీ చేయాలనుకున్న రాజమౌళి.. కానీ..?

Anilkumar
ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఇకపోతే స్టార్ డైరెక్టర్ రాజమౌళి విజయం వెనక మాత్రం ఆయన భార్య రమా రాజమౌళి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.అయితే రాజమౌళి ఏ సినిమాను తెరకెక్కించినా ఆ సినిమా కోసం జక్కన్న ఏ స్థాయిలో కష్టపడతారో ఆయన కుటుంబం కూడా అదే స్థాయిలో కష్టపడుతుంది. ఇకపోతే ఆయన మగధీర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి చిన్న సినిమాలైన మర్యాదరామన్న, ఈగ సినిమాలను తెరకెక్కించారు.ఇక ఆ తర్వాత బాహుబలి సిరీస్ తో కనీవిని ఎరుగని సక్సెస్ ను సొంతం చేసుకున్న జక్కన్న బాహుబలి సిరీస్ తర్వాత కూడా చిన్న సినిమాను చెయ్యాలని అనుకున్నారట.

ఇకపోతే అద్భుతమైన ప్రేమకథను తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకోవాలని జక్కన్న భావించారట. ఇక రాజమౌళి వైఫ్ అయిన రమా రాజమౌళి మాత్రం సినిమా విషయంలో ఏ సినిమా తీస్తే బెస్ట్ అని అనిపిస్తుందో ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని జక్కన్నకు సూచించారు.  అయితే రమా రాజమౌళి కామెంట్ల వల్ల చిన్న సినిమా తెరకెక్కించాలని అనుకున్న జక్కన్న తన నిర్ణయాన్ని మార్చుకుని ఇద్దరు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు.... ఆర్ఆర్ఆర్ సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు.అయితే  ఈ సినిమాకు పని చేసిన నటులలో ఒకరైన మకరంద్‌ దేశ్‌పాండే..

 ఆర్ఆర్ఆర్ గురించి ఈ కీలక విషయాలను వెల్లడించారు. 
ఇకపోతే ఆర్ఆర్ఆర్ మూవీ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ భుజాల పైకి ఎక్కి చరణ్ ఫైట్ చేసే సీన్ ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతోందని మకరంద్‌ దేశ్‌పాండే పేర్కొన్నారు.ఇకపోతే సెట్స్ లో తారక్ ఎప్పుడూ సినిమాల గురించి తనతో చర్చించేవారని ఆయన చెప్పడం జరిగింది.అంతేకాదు  తాను సినిమాలో కచ్చితంగా నటించాలని చెప్పి రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో నన్ను తీసుకొని మంచి రోల్ ఇచ్చారని ఆయన అన్నారు. ఇదిలావుండగా ఆర్ఆర్ఆర్ ఇప్పటివరకు 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: