టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత గతేడాది విడాకులు తీసుకున్న విషయం సంగతి తెలిసిందే.ఇకపోతే వీరు టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు సంపాదించుకున్న ఈ జంట ఎందుకు విడిపోయారో ఇప్పటికీ ఏ క్లారిటీ లేదు. అయితే అటు చై కానీ, ఇటు సామ్ కానీ ఎప్పుడూ పెదవి విప్పలేదు.ఇక సమంత విడాకులు అధికారికంగా ప్రకటించారో.. అప్పటినుంచి ఆమె పట్ల రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌తో సమంత సన్నిహితంగా ఉండడం వల్లనే చైసామ్ విడిపోయారంటూ రూమర్లు కూడా చక్కర్లు కొట్టాయి.
ఇక ఆసమయంలో సామ్, ప్రీతమ్ పేర్లు ట్రెండ్ అయ్యాయి.ప్రీతమ్ సమంతను 'అక్కా' అని పిలుస్తాడని ఆమె సన్నిహితులు చెప్పారు.కాగా అయినా కూడా ఆ వార్తలకు పులిస్టాప్ పడలేదు.అయితే నాగ చైతన్యతో విడాకులు తీసికోవడానికి స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కరే కారణమని నెట్టింట వార్తలు వచ్చినా.. సమంత మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఇకపోతే ప్రీతమ్‌తో తన స్నేహ బంధాలను మాత్రం తెంచుకోలేదు.అయితే ప్రీతమ్ ఎప్పటిలానే సమంతకు హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్నాడు. ఇక ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో సమంతతో కలిసి అతడు కూడా వెళ్లాడు. తాజాగా ప్రీతమ్‌కి సామ్ హెయిర్‌కట్ కూడా చేశారు.
అయితే ఇందుకు సంబందించిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.ఇకపోతే తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్కి సమంత హెయిర్ కట్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.అయితే 'నేను మల్టీటాలెంట్‌ని. ఇక నేను చేసిన పనికి నువ్ ఇంకా నాకు డబ్బులు చెల్లించలేదు' అని సామ్ కాప్షన్ ఇచ్చారు. ఇకపోతే దీనికి ప్రీతమ్ కూడా 'చంపెయ్' అంటూ ఫన్నీగా బదులిచ్చాడు.అయితే కొంతమంది వ్యక్తులు చేసిన నిరాధారమైన ఆరోపణలతో ప్రీతమ్‌తో తన స్నేహాన్ని మరియు అతని కెరీర్‌ను సామ్ నాశనం చేయలేదు. ఇదిలావుండగా సామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు...!!