గల్లా అశోక్.. హీరో టెస్ట్ పాస్..!
అయితే మొదటి సినిమా హీరోగా అశోక్ కి మంచి మార్కులే పడ్డాయని అంటున్నారు. చాలా చోట్ల అతను నటించడానికి ప్రయత్నించిన విధానం ప్రేక్షకులని ఆకట్టుకుందని తెలుస్తుంది. ప్రతిభ గల దర్శకుడు ఆదిత్య శ్రీరాం గల్లా అశోక్ తో చేసిన హీరో సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. సినిమా కమషియల్ లెక్కలు పక్కన పెడితే సినిమాతో గల్లా అశోక్ అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యిందని చెప్పొచ్చు.
ఇక హీరో సినిమాలో ముఖ్యంగా చెప్పుకుంటే కథానాయిక నిధి అగర్వాల్ స్పెషల్ క్రేజ్ అని చెప్పొచ్చు. ఆమె ఫాలోయింగ్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇస్మార్ట్ పాపకి ఇంత క్రేజ్ ఉందా అని ఈ సినిమాకు వచ్చిన నిధి ఫ్యాన్స్ ని చూస్తేనే అర్ధమవుతుంది. హీరోగా అశోక్ టెస్ట్ పాస్ కాగా నిధి అగర్వాల్ క్రేజ్ కూడా ఈ సినిమా తెలియచేస్తుది. ఫైనల్ గా సినిమా కలక్షన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోగా అశోక్ గల్లా ఇది గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. తొలి సినిమాతో ఓ ఐడెంటిటీ తెచ్చుకున్న గల్లా అశోక్ సెకండ్ సినిమాతో ఇంకాస్త ప్రూవ్ చేసుకుంటే అతను హీరోగా నిలదొక్కుకున్నట్టే.