రామ్ కు అది మళ్లీ కలిసి వచ్చేనా!!
ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ ల తో దూసుకుపోతున్న హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత గా పెరగడానికి కారణం. ఇక ఈ చిత్రంలో రామ్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు గా తెలుస్తుంది. పవర్ ఫుల్ కాల్ గా సినిమా లో కనిపిస్తున్న రామ్ ఇందులో సిక్స్ ప్యాక్ తో ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న రామ్ ఆ తర్వాత రెడ్ తోనూ మంచి హిట్ అందుకున్నాడు అని చెప్పాలి. ఇలా తన కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రామ్ కూడా ఇప్పుడు మంచి సినిమాలు చేయడం ఆయన అభిమానులను సంతోష పెడుతుంది.
దేవదాసు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు పరిచయమైన ఈ హ్యాండ్సమ్ హీరో కొన్ని మంచి చిత్రాలు చేసి మంచి పాపులారిటీని అందుకున్నాడు. అయితే మధ్యలో వరుస ప్లాపులతో సతమతం అయ్యాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఆయనకు సక్సెస్లు లేకపోవడంతో ఒక్కసారిగా ఆయన హీరో కెరియర్ పై అందరికీ అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆయనకు ఇచ్చిన విజయం భారీగా ఉపయోగపడింది అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన మంచి సినిమాలే చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.