అరియనా కారులో అవి ఉండాల్సిందే అట..!
ఎప్పుడూ తన సోషల్ మీడియా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే అరియానా లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాం స్టేటస్ లో తన కారులో ఉండే అతి ముఖ్యమైన వస్తువుల గురించి వీడియో షేర్ చేసింది. ఇది అరియానా కార్ అని చెప్పాలంటే తప్పకుండా బాడీ ఫర్ ఫ్యూం, లిప్ కేర్, లిప్ స్టిక్, బాడీ లోషన్ ఉంటాయని అన్నది. అంతేకాదు బాడీ ఫర్ ఫ్యూం ఒకటి అయిపోతే మరొకటి రెడీగా ఉంటుందని చెప్పుకొచ్చింది అరియానా. బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ తో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది అరియానా.
ఈమధ్యనే రాజ్ తరుణ్ తో అనుభవించు రాజా సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది అరియానా. అయితే ఆమె లీడ్ హీరోయిన్ గా ఒక సినిమా వస్తుందని అంటున్నారు. ఆ సినిమాకు సంబందించిన అప్డేట్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. అప్పట్లో అరియానా షూటింగ్ లొకేషన్స్ లో ఫోటోలు పెడుతూ నానా హంగామా చేసింది. ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో మంచి ఫాం లో ఉన్న అరియానా మంచి ఛాన్స్ వస్తే వెండితెర మీద కూడా తానేంటి అన్నది ప్రూవ్ చేయాలని చూస్తుంది. మరి అరియానాకి అలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.