మరో టాప్ హీరో సినిమా ఓ టీ టీ లోకి!!
పెరుగుతున్న వడ్డీల భారం తో నిర్మాతలు ఈ విధంగా చేయక తప్పడం లేదని వారు చెప్పకనే చెబుతున్నారు. టక్ జగదీష్ సినిమా విషయంలో నాని ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. పరిస్థితుల దృష్ట్యా అది తప్ప వేరే ఏమీ చేయలేని అని తెలిసినా కూడా నాని పై విమర్శల వర్షం కురిపించారు. కొంతమంది తర్వాత అతని పరిస్థితి తెలిసి ఆయనకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా మరో టాప్ హీరో సినిమా కూడా ఓ టీ టీ లో విడుదల అవుతుంది అన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
సుమంత్ హీరోగా నటించిన మళ్ళీ మొదలైంది సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎంతో విభిన్నం గా చేసిన సుమంత్ తప్పకుండా ఈ చిత్రం థియేటర్లలో విడుదల చేసి సక్సెస్ సాధించాలని భావించాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాలు విడుదల పోస్ట్ పోన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఓ టీ టీ లో విడుదల చేయడం జరుగుతుందని తెలుస్తుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి కథలను ఎంచుకుని ముందుకు దూసుకుపోతున్న సుమంత్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడో చూడాలి.