ఆ డ్రెస్ వేసుకున్న ప్రతిసారి నాన్న గుర్తుకు వస్తారంటూ నాగార్జున ఎమోషనల్..!!
అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించిన నాగార్జున ఈ సినిమాలో నాగచైతన్యను తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలిపారు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ యూత్ కి కనెక్ట్ కాలేకపోయిందని అన్నారు. అందుకే.. ఆ సినిమాను మించి ఉండేలా ఇందులో నాగచైతన్య చిన్న బంగార్రాజు పాత్రలో నటించారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో యాంకర్ నాగార్జునను ప్రశ్న అడుగుతూ ఈసినిమాలో మీరు మీ అబ్బాయి నటించినప్పుడు మీ నాన్నగారు గుర్తొచ్చారా అంటూ ప్రశించింది. యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇక నాగార్జున మాట్లాడుతూ మనం సినిమా మేము కాకుండా వేరే ఆర్టిస్టులతో చేసి ఉంటే అంతగా వర్కౌట్ అయ్యేది కాదని చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో నాన్న, నేను, నాగ చైతన్య ముగ్గురిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా వర్కౌట్ అయ్యేది కాదని అన్నారు.
అంతేకాదు.. నేను పంచే కట్టిన ప్రతిసారీ నాన్నగారే గుర్తొస్తారని ఈ సందర్భంగా నాగార్జున దివంగత నాగేశ్వరరావు గురించి తలచుకుని ఎమోషనల్ అవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు నాగార్జున.