అయ్యో.. సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాని..!

murali krishna
న్యాచురల్ స్టార్ నాని ఒకప్పుడు వరుస విజయాలతో జోరు మీదుండగా గత కొన్నేళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది.శ్యామ్ సింగరాయ్ మూవీతో మళ్లీ భారీ సక్సెస్ దక్కుతుందని నాని భావిస్తున్నారని సమాచారం.

శ్యామ్ సింగరాయ్ లో నాని రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తుండగా కృతిశెట్టి మరియు సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తుంది. సాయిపల్లవి దేవదాసి పాత్రలో ఈ సినిమాలో నటిస్తుండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలుస్తుంది.

నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాని మాట్లాడుతూ సాయిపల్లవి సినిమా అంటే ప్రేక్షకులు ఆమె నుంచి డ్యాన్స్ ఆశిస్తారని అయితే సాయిపల్లవి మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ వీడియోను త్వరలో రిలీజ్ చేయబోతున్నామని నాని చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. స్క్రిప్ట్ ప్రకారం సాయిపల్లవి డ్యాన్స్ చేస్తుంటే తాను ఆశ్చర్యపోతూ ఉండాలని అయితే తన డ్యాన్స్ ను చూసి తాను నిజంగానే ఆశ్చర్యపోయానని నాని చెప్పుకొచ్చారని తెలుస్తుంది..

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆ పాటను రాశారని ఈ పాట రాయడం కోసం సిరివెన్నెల గారు 45 రోజులు దేవి మీద ఉన్న పుస్తకాలను చదివారని నాని వెల్లడించారని తెలుస్తుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమాలోని సాయిపల్లవి పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని నాని చెప్పుకొచ్చారని తెలుస్తుంది.కృతిశెట్టి ఈ సినిమాలో కీర్తి అనే పాత్రలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ నటించిందని కృతిని కాకుండా ఈ సినిమాలో మరొకరిని ఊహించుకోలేమని నాని అన్నారని తెలుస్తుంది.సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకు చాలా ఇష్టమని ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయని నాని తెలిపారని తెలుస్తుంది.సిరివెన్నెల రాసిన చివరి పాట శ్యామ్ సింగరాయ్ లో ఉండటం గర్వించే విషయమని నాని చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. 24వ తేదీన టాప్ లేచిపోతుందని శ్యామ్ సింగరాయ్ పై అంచనాలు పెరిగే విధంగా నాని కామెంట్లు చేశారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: