జబర్దస్త్ షో కి మరొక కమెడియన్ గుడ్ బై..?

Divya
బుల్లితెరపై కామెడీ షో లలో ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ కు చాలా క్రేజీ ఉంది. ఎక్కడో దూరంగా ఉన్న వారిని సైతం ఆర్టిస్టులుగా మార్చింది ఈ షో. అలా ఎంతో మంది ప్రస్తుతం నటనతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ షో టిఆర్పి రేటింగ్ విషయంలో చాలా డల్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. దాదాపుగా ఏడు సంవత్సరాలలో ఇప్పుడున్నంత తక్కువ రేటింగ్ ఎన్నడూ లేనట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ జబర్దస్త్ కూడా షో ఒక కమెడియన్ గుడ్ బై చెబుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.
ఎంత మందిని కమెడియన్గా తీర్చిదిద్దిన కమెడియన్ అదిరే అభి త్వరలోనే జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెబుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికీ ఇందులో నుంచి ముక్కు అవినాష్, చమ్మక్ చంద్ర వంటి వారు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఒకరు మించి ఒకరు ఇలా వెళ్ళిపోతుంటే.. ఈ షో నడవడం చాలా కష్టంగా ఉంది అన్నట్లుగా.. అభిప్రాయపడుతున్నారు ప్రేక్షకులు.
ఇక అదిరే అభి అంటే కేవలం ఒక కమెడియన్ ఏ కాకుండా ఒక మంచి మనిషి కూడా అని చెప్పవచ్చు. ఎందరో కమెడియన్స్ ని తన షో కి తీసుకు వచ్చి వారికి లైఫ్ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఈయన ఎందుకు జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అనే విషయం మాత్రం తెలియజేయలేదు. అయితే తన నెక్స్ట్ స్టెప్ మాత్రం కామెడీ స్టార్స్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ వార్త బాగా వినిపిస్తోంది ఇప్పుడు. ఈ ఆదివారం నుంచి అదిరే అభి స్టార్ కామెడీలో కనిపించబోతున్నాడని వినిపిస్తోంది. ఇక ఈయన ఒక్కరే కాకుండా మరికొంత మంది కూడా ఈ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇది వైరల్గా మారుతోంది. ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో  వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: