మహేష్ పోకిరి సినిమా మెగాస్టార్ నటించిన ఆ సినిమాను పోలి ఉందట...!

murali krishna
2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పోకిరి సినిమా ఎంత సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. మహేష్ బాబు మరియు ఇలియానా కలిసి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకొని రికార్డుకెక్కిందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అలాగే సాయాజీ షిండే, బ్రహ్మానందం మరియు ఆలీ, నాజర్ వంటి పలువురు నటీ నటులు నటించారని తెలుస్తుంది.

ఈ సినిమాలోని డైలాగులు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తుంది.. ఇందులో పాటలు కూడా ఎంతో మంచి సక్సెస్ ను అందుకున్నాయని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా తెలుగులో హిట్ అవడంతో తమిళంలో 2007లో పోకిరి అనే పేరుతో రీమేక్ చేశారట.. హిందీలో వాంటెడ్ అనే టైటిల్ తో విడుదలయిందని సమాచారం.. కన్నడ భాషలో పోర్కి అలాగే బెంగాలీలో రాజోట్టో పేర్ల తో రీమేక్ చేశారట.. అక్కడ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడని తెలుస్తుంది.. అదేంటి మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా వెనకాల ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా ఏమిటి అవును మీరు విన్నది నిజమేనండి ఈ సినిమా కథ అచ్చం చిరంజీవి నటించిన కథలాగే ఉందని తెలుస్తోంది.ఇంతకు అది ఏ సినిమా అంటే.. 1988లో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టేట్ రౌడీ సినిమా అని తెలుస్తుంది.. ఈ సినిమాలో చిరంజీవి మరియు రాధా నటీనటులుగా నటించారని ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుందని తెలుస్తుంది.ఇందులో పాటలు మరియు చిరంజీవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారట.ఇందులో భానుప్రియ కూడా హీరోయిన్ గా నటించిందని తెలుస్తుంది.. రావు గోపాల్ మరియు నూతన్ ప్రసాద్ అలాగే త్యాగరాజన్ ఆంటీ పలువురు నటీనటులు నటించారని తెలుస్తుంది.

  ఇక ఈ సినిమా కథ కూడా అచ్చం పోకిరి సినిమా లాగే ఉందని తెలుస్తుంది.. నిజానికి ఈ సినిమా కథనే పోకిరి సినిమాగా తెరకెక్కించారట.. పోకిరి సినిమాలో మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ గా ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా పోకిరి గా తిరుగుతూ చివరికి క్లైమాక్స్ లో పోలీస్ అని ట్విస్ట్ ఇవ్వగా ఈ క్లైమాక్స్ మాత్రం బాగా అదిరిపోయిందని తెలుస్తుంది..ఇక చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా కూడా అండర్ కవర్ పోలీస్ గా తెరకెక్కిందట.ఇందులో చిరంజీవి కూడా అండర్ కవర్ పోలీస్ గా ఉంటూ ఏమాత్రం అనుమానం రాకుండా రౌడీ గా నటించి చివరికి పోలీస్ అని ట్విస్ట్ ఇవ్వటంతో ఈ సీన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని తెలుస్తుంది.
అంతేకాకుండా స్టేట్ రౌడీ లో మరియు పోకిరి లో పాత్రలు కూడా చాలా వరకు ఒకేలా ఉన్నాయని తెలుస్తుంది.అలా అప్పుడు స్టేట్ రౌడీ తో చిరంజీవి, పోకిరి తో మహేష్ బాబు తమ ఖాతాలో మంచి సక్సెస్ ను నింపుకున్నారని తెలుస్తుంది.. ఇప్పటికీ ఈ సినిమాలు బుల్లితెరపై ప్రసారం అవుతే మాత్రం ప్రేక్షకులు అస్సలు మిస్ అవ్వరని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: