హీరో హరీష్ నటించిన సూపర్ హిట్ సినిమాలివే..??

N.ANJI
ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ఈ మాయ లోకంలో అడుగుపెట్టడానికి అందరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. నేటి సమాజంలో చిన్న పిల్లలు సైతం ఇండస్ట్రీలో రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది నటులు బాల నటులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు కుండా ఉన్నారు. ఆలా బాల నటుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టి స్టార్ హీరోగా రాణించిన వ్యక్తి హరీష్. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించాడు.
ఇండస్ట్రీలో బాల నటుడిగా  మంచి పేరు తెచ్చుకుని టీనేజ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ పలు విజయాలను అందుకున్నాడు. అంతేకాదు.. ఆయన నటించిన పలు సినిమాలు ప్లాప్స్ కూడా అయ్యాయి. హీరో హరీష్ నటించిన సినిమాల విషయానికి వస్తే..  ఆయన నటించిన వివాహభోజనంబు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఆయన నటించిన అశోక చక్రవర్తి సినిమా పరాజయం కాగా.. ప్రేమ ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలాగే అక్కినేని నాగేశ్వర్ రావు, హరీష్  నటించిన మాధవయ్యగారి మనవడు సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అలాగే ప్రేమ పంజరం ఏవరేజ్ కాగా, పెళ్ళాం చెబితే వినాలి మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాక.. రౌడీ ఇన్ స్పెక్టర్ విజయం అందుకోగా.. కాలేజీ బుల్లోడు సినిమా ఏవరేజ్ గా రాణించింది. ఇక ఏవండీ ఆవడి వచ్చింది సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాక.. ప్రాణదాత, ఇన్ స్పెక్టర్ ఝాన్సీ సినిమాలు ఏవరేజ్ నిలిచాయి. అలాగే మనవరాలి పెళ్లి సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. హరీష్ నటించిన కుర్రది కుర్రాడు ప్లాప్ కాగా, బంగారు కుటుంబం, జైలర్ గారి అబ్బాయి సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఎస్పీ పరశురామ్ ప్లాప్ కాగా.. కొండపల్లి రత్తయ్య, ఓహో నా పెళ్ళంట, సూపర్ హీరోస్ ఏవరేజ్ రాణించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: