బంగార్రాజు నుండి అదిరిపోయే అప్డేట్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరో గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు, ఈ సినిమా లో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ముఖ్య పాత్ర లో నటిస్తుండగా, ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బంగార్రాజు సినిమా నుండి ఇప్పటికే కొన్ని పోస్టర్ లను, ఒక పాటను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇది లా ఉంటే తాజా గా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.

బంగార్రాజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టీజర్  విడుదల తేదీలను తెలియజేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. బంగార్రాజు సినిమా ఫస్ట్ లుక్ ను 22 నవంబర్ సాయంత్రం 5 :22 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అలాగే బంగార్రాజు సినిమా టీజర్ ను 23 నవంబర్ ఉదయం 10:23 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఉద్దేశం లో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది, దానికి ప్రధాన కారణం సోగ్గాడే చిన్నినాయన సినిమా కూ డా సంక్రాంతి కానుక గా విడుదలై బ్లాక్ బస్టర్ కావడమే. నాగార్జున ఈ సినిమా తో పాటు గరుడ వేగ సినిమా తో మంచి విజయం అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా లో కూడా హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: