మీకు తెలియని నయనతార సీక్రెట్ ఏంటో తెలుసా..?

N.ANJI
చిత్ర పరిశ్రమలో నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె హీరో పక్కన హీరోయిన్ గా నటిస్తూనే సోలో హీరోయిన్ గా సినిమాలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. అయితే నయనతార గురించి మీకు తెలియని సీక్రెట్స్ ఏంటో ఒక్కసారి చూద్దామా. నయనతార ఎన్ని సినిమాలు చేసినా వాటి ప్రొమోషన్స్ కి మాత్రం దూరంగా ఉంటుంది. అంతేకాదు.. ఆమె ఎప్పుడూ తను నటించిన సినిమా గురించి బయట ఒక్క మాట కూడా మాట్లాడి ప్రోమోట్ చేయని ఏకైక హీరోయిన్ నయనతార మాత్రమే.
అయితే అసలు సంగతి ఏంటంటే.. నయన్, ఎందుకు ప్రమోషనల్ ఈవెంట్స్ కి రాదు అనే డౌట్ అందరిలోనూ ఉండే ఉంటుంది. ఎవరు ఏమి ఎనుకున్న ఎన్ని విమర్శలు చేసినా, తనపై ఏ వివాదం జరిగినా నయన్ మాత్రం బయటకి రాదు ఒక్క మాట కూడా మాట్లాడరంట. అంతేకాదు.. మీడియాలో కూడా కనిపించని నయనతారని సినిమాల్లో మాత్రమే చూడాలి అంత ప్రైవసీ మైంటైన్ చేస్తుంటది నయనతర. ఇక దాదాపు దశాబ్దం తర్వాత మొదటిసారి ఈ విషయంపై స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార.. ఓ విషయాన్ని వెల్లడించారు. అందేంటంటే.. తాను ఎందుకు మీడియాకి దూరంగా ఉంటుందో చెప్పిన నయన్, జనరల్త గానే తాను చాలా ప్రైవేట్ పర్సన్ అని… తన గురించి ఎవరికీ పెద్దగా తెలియడం తనకి ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన మాటలని మీడియా చాలా సార్లు తప్పుగా ప్రచారం చేసిందని, తన మాటల వెనుక ఉన్న ఇంటెన్షన్ ని మార్చి చూపించారని అందుకే తాను మీడియాకి దూరంగా ఉంటానని అన్నారు. ఇక తను ఒక నటిని మాత్రమే అని, తన సినిమాలే మాత్రమే మాట్లాడుతాయని నయన్ వెల్లడించారు. అందుకే దశాబ్ద కాలంగా నయనతార మీడియా ముందుకి, సోషల్ మీడియాలోకి ఎందుకు రాదు అనే విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: