కొడాలి నాని తో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

Sahithya
టాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా సరే అదుర్స్ సినిమా తర్వాత ఏపీ మంత్రి కొడాలి నాని పేరు అప్పుడప్పుడు వినబడుతూంటుంది. ఆయన సినిమా చేయకపోయినా సరే అక్కడ ఉన్న కొంత మంది ప్రముఖులతో చర్చలు జరపడం అలాగే కొన్ని సినిమా కార్యక్రమాలకు హాజరు కావడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆయన సన్నిహితుడు వల్లభనేని వంశీ అప్పుడప్పుడు సినిమాలు నిర్మిస్తూ ఉండగా ఆ సినిమా కార్యక్రమాల ఓపెనింగ్ కి వెళుతుంటారు కొడాలి నాని. అయితే ఇప్పుడు కొడాలి నాని సినిమాలను నిర్మించడానికి కూడా సిద్ధం అవుతున్నారు అనే వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో వినపడుతున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని టాలీవుడ్ వర్గాల మాట. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సినిమాకు నిర్మాతగా కొడాలి నాని వ్యవహరించే అవకాశం ఉందని దీనికి సంబంధించిన కథ కూడా రెడీ అయిందని దాదాపుగా ఈ సినిమాలో కొడాలి నాని 80 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారని అంటున్నారు. ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారని దానిపై క్లారిటీ లేకపోయినా 2024 వేసవిలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
దీని పై కొడాలి నాని చాలా ఆసక్తికరంగా ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ తో కూడా దీనిపై చర్చలు జరిపారు అని టాలీవుడ్ అంటుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా లో కొడాలి నాని తో పాటుగా మరో ఎమ్మెల్యే కూడా పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా సరే అదుర్స్ సినిమా తర్వాత కొడాలి నాని మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని రెడీ కావడం టాలీవుడ్ లో హైలెట్ అవుతున్న అంశం. మరి ఇది ఎంతవరకు నిజం ఈ సినిమా ఎంత వరకు ముందుకు వెళుతుంది అనేది తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: