బొమ్మరిల్లు భాస్కర్ వైపు అల్లు శిరీష్ అడుగులు !

Seetha Sailaja

అల్లు కాంపౌండ్ సపోర్ట్ పూర్తిగా ఉన్నప్పటికీ అల్లు శిరీష్ ఇప్పటికీ పూర్తిగా హీరోగా సెటిల్ కాలేకపోతున్నాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ మూవీ తరువాత శిరీష్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన హిట్ ఇప్పటి వరకు అతనికి రాలేదు. ఇలాంటి పరిస్థితులలో త్వరలో అల్లు శిరీష్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాంబినేషన్ లో ఒక మూవీ ఉంటుందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో .వస్తున్నాయి. బొమ్మరిల్లు తరువాత చాల సంవత్సరాలకు భాస్కర్ కు ఒక హిట్ తగిలింది.

వాస్తవానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీ కథ విషయంలో భాస్కర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయినప్పటికీ దసరా రేస్ కు వచ్చిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో భాస్కర్ కు దశ తిరిగింది. దీనితో ఈ దర్శకుడు చేయబోయే మూవీ ప్రాజెక్ట్ ఏమిటి అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాస్కర్ మాట్లాడుతూ తన వద్ద రెండు మూడు కథలు రెడీగా ఉన్నాయని ఆ స్టోరీ లైన్స్ ఏ హీరోకైనా నచ్చితే ఆ స్టోరీ లైన్ డెవలప్ చేసి తాను సినిమా తీయడానికి రెడీగా ఉన్నాను అంటూ సంకేతాలు ఇచ్చాడు.

తెలుస్తున్న సమాచారం మేరకు అరవింద్ బొమ్మరిల్లు భాస్కర్ తో మరొక సినిమాను తీసే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అంతేకాదు మళ్ళీ అఖిల్ భాస్కర్ ల కాంబినేషన్ రిపీట్ చేసే ఆలోచనలు కూడ అరవింద్ కు ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉన్న అఖిల్ అరవింద్ కు మళ్ళీ డేట్స్ ఇచ్చే అవకాశం ఇప్పట్లో ఉండక పోవచ్చు అంటున్నారు.

దీనితో అరవింద్ అల్లు శిరీష్ భాస్కర్ ల కాంబినేషన్ సెట్ సెట్ చేసే అవకాశం ఉండవచ్చు అని కూడ ఊహాగానాలు ఉన్నాయి. అయితే భాస్కర్ కథలలో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మరొకసారి రుజువు చేసింది. ఇలాంటి పరిస్థితులలో ధైర్యం చేసి అరవింద్ శిరీష్ భాస్కర్ ల కాంబినేషన్ సెట్ చేసే సాహసం చేయగలడా అన్న సందేహాలు కూడ ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: