ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

NAGARJUNA NAKKA
ప్రభాస్ సినీ కెరియర్ గురించి చెప్పాలంటే.. బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని చెప్పుకోవాలి. బాహుబలికి ముందు కేవలం తెలుగు సినిమాలతోనే ప్రేక్షకులను అలరించిన ప్రభాస్.. బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్థాయికి ఎదిగారు. పెద్ద పెద్ద సినిమాలతో పెద్ద స్టార్ గా ఎదిగిపోయాడు. ఉత్తరాది మార్కెట్ లో 500కోట్ల రూపాయలకు పైగా వసూల్‌ చేసిన తొలి సినిమాగా రికార్డ్‌ క్రియేట్ చేసింది బాహుబలి.
'బాహుబలి' సినిమా తర్వాత  ప్రభాస్ ఒక చిన్న సినిమా చేయాలని భావించాడు. కానీ ఊహించని విధంగా ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌ సాధించడంతో ఆయన ఆలోచనల్లో మార్పులొచ్చాయి. 'సాహో' సినిమాతో మరింత క్రేజ్ పెంచుకున్నాడు. బాలీవుడ్‌ నుంచి ఆర్టిస్టులు దిగారు. హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ వచ్చారు. 'సాహో' హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీలా మారింది. అయితే ఈ సినిమాకి తెలుగులో కంటే హిందీలో పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. దీంతో వరుసగా లార్జ్‌ స్కేల్‌ మూవీస్‌ చేస్తున్నాడు ప్రభాస్.
ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్' చేస్తున్నాడు. ఓం రౌత్‌ దర్శకత్వంలో 'ఆదిపురుష్‌' చేస్తున్నాడు. వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్నాడు ప్రభాస్. అలాగే నాగ్‌అశ్విన్‌తో 'ప్రాజెక్ట్ కె', సందీప్ వంగాతో 'స్పిరిట్' సినిమాలు చేస్తున్నాడు.
ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా ఊహించని రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. లార్జ్‌ స్కేల్‌ మూవీస్‌తో మాగ్జిమమ్‌ థ్రిల్ ఇస్తున్నాడు. అయితే అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న అనౌన్స్‌మెంట్ మాత్రం పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. ప్రతీ రోజూ ఏదో ఒక వార్త రావడం అభిమానులు డిసప్పాయింట్‌ కావడం రెగ్యులర్‌గా జరుగుతోంది.
ప్రభాస్ ఇప్పటికే నాలుగు పదులు దాటిపోయాడు. ఇంట్లోవాళ్లు డార్లింగ్‌ కోసం గోదారి అమ్మాయిని చూశారని ఒకసారి, టాలీవుడ్‌లో బిగ్‌షాట్‌ కూతురిని పెళ్లి చేసుకుంటాడని మరోసారి, ఎన్నారైతో మ్యాచ్‌ ఫిక్స్ అయ్యిందని ఇంకోసారి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు పెళ్లి గురించి ప్రభాస్ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: