యాంకర్స్ గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు..!

Pulgam Srinivas
తెలుగు స్టార్ హీరోలు ఒకప్పుడు కేవలం సినిమాలతో మాత్రమే తమ అభిమానులను మరియు ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. ఈ హీరోల అభిమానులు కూడా తమ హీరోలను వెండి తెరపై చూడాలని మాత్రమే ఎక్కువగా ఆత్రుత చూపించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి తెలుగు లోని ఎంతో మంది స్టార్ హీరోలు ఇటు సినిమాలతో జనాలను అలరిస్తూనే అటు బుల్లితెర, ఓటిటి షోలకు హోస్ట్ గా వివరిస్తూ జనాలను అలరిస్తున్నారు. అలా తెలుగు స్టార్ హీరోలలో బుల్లితెరపై మరియు ఓటిటి లో కనిపించి మెప్పించిన వారి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చిరంజీవి : టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో తో జనాలు ఎంత అలరించాడో. మన అందరికీ తెలిసిందే అలాంటి ఈ స్టార్ హీరో స్టార్ మా చానల్‌ లో ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు హోస్ట్ గా వ్యవహరించే తన అభిమానులతో పాటు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.
బాలకృష్ణ : తెలుగు ప్రముఖ ఓటిటి ఆహ లో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే అన్ స్టాపాబుల్ అనే టాక్ షో కు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించడానికి రెడీగా ఉన్నాడు.
కింగ్ నాగార్జున : బిగ్ బాస్ (స్టార్ మా), మీలో ఎవరు కోటీశ్వరుడు (స్టార్ మా)కు హోస్టుగా వ్యవహరించే ఎంతోమంది బుల్లితెర అభిమానులను అలరించాడు.
జూనియర్ ఎన్టీఆర్ : బిగ్ బాస్ సీజన్ 1 (స్టార్ మా), ఎవరు మీలో కోటీశ్వరులు (జెమినీ)తో హోస్టుగా వ్యవహరించి తన అభిమానులతో పాటు ఎంతోమంది బుల్లితెర అభిమానులను కూడా అలరించాడు.
రానా దగ్గుబాటి : నెంబర్ వన్ యారీ (జెమినీ)కు హోస్టుగా వ్యవహరించే జనాలను అలరించాడు.
నాని : నెంబర్ వన్ యారీ (జెమినీ)కు హోస్టుగా వ్యవహరించే తన అభిమానులతో పాటు బుల్లితెర అభిమానులను కూడా అలరించాడు.
సాయి కుమార్ : ఈటీవీ లో ప్రసారం అయిన వావ్, మనం హోస్టుగా వ్యవహరించి ఎంతమంది బుల్లితెర అభిమానుల మనసు దోచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: