గౌతమ్ తిన్ననూరి తో సినిమా కన్ఫామ్ చేసిన రామ్ చరణ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాను దాదాపుగా పూర్తి చేసి ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీ న ప్రపంచ వ్యాప్తం గా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి కావడంతో రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన  సినిమా పై తన ఫుల్ ఫోకస్ ను పెట్టాడు. దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించే ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతోంది.

 అలాగే ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చ బోతున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతుంది. ఇలా ఇప్పటికే రెండు వరుస పాన్ ఇండియా సినిమాలు తో ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్ తన తదుపరి సినిమా వివరాలను  దసరా సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఎన్నో రోజులుగా రామ్ చరణ్ ,గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో  సినిమా చేయబోతున్నాడు అంటూ అనేక వార్తలు వచ్చాయి . అయితే ఆ వార్తలను నిజం చేస్తూ యు.వి క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోతున్నట్లు, స్వయంగా రామ్ చరణ్ నే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా జనాలకు తెలియజేసాడు. ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పోస్ట్ పెట్టడం తో నే ఈ సినిమాపై జనాల్లో అంచనాలు పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: