లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతికి సీక్రెట్ గా పిల్లలున్నారా..??
అయితే విజయశాంతి సినిమా కెరియర్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. కాగా.. ఆమె రాజకీయాల్లో పెద్దగా గుర్తింపు పొందలేకపోయినప్పటికీ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది ఈ సూపర్ స్టార్ విజయశాంతి. అంతేకాదు.. విజయశాంతి రీ ఎంట్రీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇందులో విజయశాంతి పాత్ర కూడా ఎంతో కీలకమైనది అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతేకాక.. విజయశాంతి వ్యక్తిగత విషయానికి ఈమెకు పిల్లలు ఉన్నారంటూ అయితే వారిని ప్రపంచానికి పరిచయం చేయలేదని పెద్దఎత్తున వార్తలు వినపడుతున్నాయి. విజయశాంతి పిల్లలు ఉన్న సంగతిని ఎందుకు బయట పెట్టలేదనే విషయం అప్పట్లో చర్చనీయాంశంగా ఉన్న అందరిలో సందేహాలను కలగజేశాయి. అంతేకాదు.. ఒకానొక సమయంలో విజయశాంతి తన ఆస్తులు అన్నింటిని ఒక ఆశ్రమానికి దానం చేసినట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అందరికీ ఆమె పిల్లల విషయం గురించి ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఒకవేళ ఈమెకు పిల్లలు ఉంటే ఎందుకు లోకానికి పరిచయం చేయలేదన్న సందేహాలు కూడా పలువురికి వస్తూనే ఉన్నాయి.