ఆ సినిమాలో విలన్ పాత్ర చేస్తూ.. జగపతిబాబు రక్తం కక్కుకున్నాడట?

praveen
టాలీవుడ్లో చాలా మంది విలన్ పాత్రలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే విలన్ పాత్రలో ఒదిగిపోయి పాత్రకు ప్రాణం పోసేవారు ఉన్నారు. అలాంటి వారిలో జగపతిబాబు ఒకరు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించారు  జగపతిబాబు.  ఎప్పుడు ఎంతో డీసెంట్గా కనిపిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తెలుగు తెరపై కనుమరుగైపోయారు అని చెప్పాలి. అలాంటి ఒక డీసెంట్ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు విలన్ గా ఎంట్రీ ఇవ్వడం అంటే మొదట తెలుగు ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు.

 కానీ ఏకంగా పవర్ఫుల్ హీరో అయిన బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యపరిచాడు జగపతిబాబు.  ఫ్యామిలీ హీరో అయిన జగపతిబాబులో ఈ యాంగిల్ కూడా దాగి ఉందా అని అనుకున్నారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా జగపతిబాబు కు తిరుగులేదు అని చెప్పాలి. వరుసగా అవకాశాలు అందుకుంటూ ఏ స్టార్ హీరో సినిమాలో చూసినా జగపతిబాబు విలన్ గా కనిపించారు. కేవలం రౌద్రంగా కనిపించే పాత్రల్లోనే కాదు ఎంతో సాఫ్ట్ గా కనిపించే పాత్రల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు జగపతిబాబు.

 ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలో విలన్ పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు.  ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో పగ ప్రతీకారాల తో రగిలి పోయే బసి రెడ్డి పాత్రలో నటించాడు జగపతి బాబు. ఇక ఈ పాత్రలో జగపతిబాబు ఒదిగిపోయి నటించి ఆ పాత్రలకు ప్రాణం పోసాడు అనే చెప్పాలి.  ఇక జగపతి బాబు నటన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ పాత్ర కోసం జగపతిబాబు ఎంత కష్టపడ్డాడుఅంటే..  ఈ పాత్రలో గొంతులో హీరో దింపిన కత్తి కి సంబంధించిన గాయం అలాగే ఉంటుంది. అయినప్పటికీ పవర్ ఫుల్ డైలాగ్స్ దగ్గుతు చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ పాత్ర కోసం డబ్బింగ్ చెబుతున్న సమయంలో దగ్గుతూ డైలాగ్స్ చెప్పడం వల్ల ఏకంగా కొన్నిసార్లు గొంతులో నుంచి రక్తం కూడా కక్కుకున్నాడట జగపతిబాబు.  ఇక ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాడట. ఇక ఈ పాత్ర జగపతిబాబుకు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకునెలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: