బన్నీ తో వెళ్లడం బోయపాటి కే మైనస్సా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో యాక్షన్ సినిమాల దర్శకుడు గా బోయపాటి శ్రీనుకి మంచి ఇమేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ముందు బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే చిత్రం చేయగా అది బాక్స్ ఆఫీసు వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింద. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్నో విమర్శలు రాగా ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికి ఈ సినిమాను హిట్ చేయాలని భావించి తన ప్రతిభను ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
వారం రోజుల షెడ్యూల్ తో సినిమా ను ముగించ బోతున్నాడు అని తెలుస్తుంది. గోవాలో ఈనెల 13వ తేదీ నుంచి షూటింగ్ మొదలుపెట్టి ఈ నెల ఫస్ట్ కాపీ రెడీ చేసే ఆలోచనలో ఉందట ఈ సినిమా బృందం. ఈ సినిమా ను దసరా కి విడుదల చేయాలని భావిస్తూ ఉండగా అప్పటి వరకు ఈ సినిమా రెడీ అవుతుందా లేదా అనే అనుమానం మరోపక్క అందరిలో ఉంది.  ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో మరొక మాస్ మసాలా సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సరైనోడు వంటి సూపర్ హిట్ సినిమా రాగా ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను అభిమానులు అల్లు అర్జున్ తో సినిమా చేయడం నచ్చడం లేదు. కారణం బన్నీ చేస్తున్న పుష్ప సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం. వచ్చే ఏడాది వేసవి కి గానీ ఈ సినిమా పూర్తి అవదు. అది పూర్తయ్యేసరికి ఆయన ఖాళీగా ఉండటం ఆయన అభిమానులకు నచ్చడం లేదు.  అల్లు అర్జున్ తో సినిమా చేయడం బోయపాటి శ్రీను కు ప్లస్ అవుతుంది అనుకున్నారు కానీ అదే ఇప్పుడు పెద్ద మైనస్ గా మారింది. అల్లు అర్జున్ ఖాళీ అయ్యే దాకా వెయిట్ చేయాలంటే బోయపాటి శ్రీను ఈ లోపు ఓ సినిమాను కూడా పూర్తి చేయొచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: