డబల్ యాక్షన్ సినిమాలు అంటేనే భయపడుతున్న హీరోలు?

VAMSI
సినిమాలను తెరకెక్కించే కథనాలు ఎన్నో రకాలు. ఒక్కో డైరెక్టర్ తన ప్రతిభ టాలెంట్ తో ఒక్కో విధంగా వెండి తెరపై మ్యాజిక్ చేస్తుంటారు. అందులో ఒకటి డబుల్ యాక్షన్ తరహా చిత్రాలు. దర్శకులకు ఇదో ఛాలెంజ్...ఒకే వ్యక్తిని ఇద్దరిగా చూపించాలి. ఈ డబుల్ యాక్షన్ సినిమాకి తగ్గట్టుగా మంచి గ్రిప్ ఉన్న కథ కుదరాలి. దాన్ని టేక్ ఆఫ్ పై డైరెక్టర్ కి పూర్తి క్లారిటీ ఉండాలి. అదే స్పీడ్ తో ముందుకు తీసుకెళ్లే కథని సింప్లీ సూపర్ గా ముగించాలి. అప్పుడే ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని రాబడుతుంది. గతంలో డబుల్ యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించి బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకోగా కొన్ని చిత్రాలు మాత్రం అదే ఆడియన్స్ ని అయ్య బాబాయ్ అంటూ బయపెట్టాయి.
అదేనండి ప్రేక్షకుల్ని అలరించలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డాయి. మన అన్న సీనియర్ ఎన్టీఆర్ నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, అలాగే నేటి తరం హీరోలు ప్రభాస్(బాహుబలి), జూనియర్ ఎన్టీఆర్(అదుర్స్, జై లవకుశ ,) లు కూడా డబల్ యాక్షన్ సినిమాలతో ఎక్స్పరిమెంట్స్ చేసిన వారే. దాదాపుగా అందరూ విజయాలే అందుకున్నారు. కానీ స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్ లు మాత్రం అసలు డ్యూయల్ రోల్ ఉండే సినిమాల జోలికి పోలేదు. ఈ విషయం అలా ఉంచితే ఈ మధ్యకాలంలో డబల్ యాక్షన్ చిత్రాల మాటే వినిపించడం లేదు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ తమ పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఎవ్వరూ కూడా డ్యూయల్ రోల్ మూవీస్ చేయడానికి ఇష్టంగా లేరు.
ఎందుకంటే ఈ సినిమాలు అందరికీ సెట్ కావు మరియు ఈ సినిమాలను తెరకెక్కించాలంటే అందరి డైరెక్టర్ ల వల్ల కూడా కాదు. అందుకే పెద్దగా ఆసక్తి చూపరు. గతంలో అయితే చాలా సినిమాలు డ్యూయల్ రోల్ లో వచ్చి మెప్పించాయి. కానీ ఇప్పుడు ఆవంత కుదిరే పని కాదని తెలుస్తోంది. పైగా డ్యూయల్ రోల్ అంటే పారితోషికం కూడా ఎక్కువే అవుతుంది. కాబట్టి నిర్మాతలు అంగీకరించరు. ముఖ్యంగా నాని "కృష్ణార్జున యుద్ధం" లో డ్యూయల్ రోల్ చేసి చేతులు కాల్చుకున్నారు. అలాగే రవితేజ్ "కిక్ 2" తీసి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. కాబట్టి ఇది అందరూ అన్నిసార్లు హిట్ కొట్టడం సాధ్యం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: