కొనసాగుతున్న పరిణామాల పై ఇండస్ట్రీ ప్రముఖుల మౌనం !

Seetha Sailaja

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ధియేటర్ల టిక్కెట్లను ఆన్ లైన్ లో అమ్మాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నప్పటికీ ఈవ్యవహారం పై ఇప్పటివరకు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కామెంట్స్ చేసే పవన్ కళ్యాణ్ కాని ఇప్పటివరకు స్పందించలేదు. వీరిద్దరు మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు కాని నిర్మాతలు కాని ఇలా ప్రముఖులు అందరు మౌనంగానే కొనసాగుతున్నారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం భారీ సినిమా నిర్మాతలకు టాప్ హీరోలకు ఏమాత్రం రుచించదు అన్నది ఓపెన్ సీక్రెట్. టాప్ హీరోల సినిమాలకు వందల కోట్లల్లో కలక్షన్స్ రావాలి అంటే టిక్కెట్ల రెట్ల పై ఎటువంటి నియంత్రణ ఉండకూడదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే టాప్ హీరోల భారీ సినిమాలను బయ్యర్లు మోజుపడి భారీ రేట్లకు కొంటారు.

ఇప్పుడు టిక్కెట్ల విషయంలో నియంత్రణ ఉంటే ముందుగా నష్టపోయేది ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘పుష్ప’ ‘అఖండ’ లాంటి సినిమాలు. అయితే ఈసినిమా నిర్మాతలు కూడ అత్యంత కీలకమైన ఈవిషయం పై సపంధించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది ఇలా ఉండగా ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లు అమ్మాలని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులే కోరారు అంటూ వస్తున్న వార్తలు మరింత సంచలనంగా మారాయి.

ప్రభుత్వ నిర్ణయం పై మీడియా సంస్థలు ముఖ్యంగా ఛానల్స్ చర్చాగోష్టులు పెడుతున్నాయి కాని ఈ విషయాల పై పట్టించుకోకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నటీనటులు ప్రముఖులు మా సంస్థ ఎన్నికల గురించి బాగా ఆలోచనలు చేస్తున్నారు అని అనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం ఇలా ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా అనేకమంది ప్రముఖ నిర్మాతలు తమ భారీ సినిమాల ప్రకటనలను కొనసాగిస్తూ చేస్తున్న హడావిడి చూస్తుంటే ఇండస్ట్రీ ప్రముఖులకు టిక్కెట్ల రెట్లు ఎలా ఉన్నప్పటికీ తమ బయ్యర్లు ఇలాగే భారీ మొత్తాలతో తమ సినిమాలు కొంటారని నమ్మకంతో ఉన్నట్లు అనిపించడం సహజం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: