"సలార్" యాక్షన్ కే సగం బడ్జెట్ !

Vimalatha
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో రాత్రి, పగలు తేడా లేకుండా షూటింగులు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలను అన్నిటినీ త్వరగా పూర్తి చేసే పనిలో పడిపోయారు. ఈ మేరకు త్వర త్వరగా అన్ని ప్రాజెక్టుల షూటింగ్ లను కంప్లీట్ చేయడానికి ఆయన శక్తి మేర పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రభాస్ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది.
తాజాగా ఆయన సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం శాండల్ వుడ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు మేజర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలోనే మరో షెడ్యుల్ కు సన్నాహాలు చేస్తోంది అని చిత్రబృందం. తాజా షెడ్యూల్ లో సినిమా లోని భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించనున్నారట. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. చిత్ర బృందం ఈ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ న్యూస్ విన్న ప్రభాస్ అభిమానులకు మంచి జోష్ వచ్చేసింది.
ఇప్పటికే 'కేజిఎఫ్' వంటి భారీ యాక్షన్ మూవీ ని అన్ని భాషల ప్రేక్షకులకు అందించి అలరించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ ను కూడా ఇంకా అద్భుతంగా చూపిస్తాడని రెబల్ స్టార్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి ప్రశాంత్ నీల్ వారి అంచనాలను ఏమేరకు అందుకుంటాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలతో పేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. జనవరి 14న ప్రభాస్ "రాధేశ్యామ్" విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: