ఆచార్య కు క్రాక్ అనుసరణ !

Seetha Sailaja

కరోనా థర్డ్ వేవ్ ఇప్పట్లో రాదు అన్న నమ్మకం అందరికీ కలుగుతూ ఉండటంతో అక్టోబర్ నుండి అన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ దసరా కు రావడంలేదు అని అధికారికంగా ప్రకటించి రోజులు గడుస్తున్నప్పటికీ ‘ఆచార్య’ నిర్మాతలు ఈమూవీ విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పటికే దసరా కు చాల సినిమాలు రెడీ అయ్యాయి. బాలకృష్ణ ‘అఖండ’ కూడ దసరా రేస్ కు రెడీ అవుతున్న పరిస్థితులలో ఇన్ని సినిమాల మధ్య పోటీ ఎందుకని ‘ఆచార్య’ ను దీపావళికి విడుదల చేద్దాము అనుకున్నారు. అయితే ఈమూవీ బయ్యర్లు అమావాస్య సెంటిమెంట్ ను బయటపెట్టడంతో ఈమూవీ డిసెంబర్ లో విడుదల చేద్దాము అనుకుంటే అక్కడ అల్లు అర్జున్ ‘పుష్ప’ అడ్డు తగులుతోంది.

దీనితో ‘ఆచార్య’ తన రూట్ మార్చుకుని రవితేజా ‘క్రాక్’ విషయంలో అనుసరించిన విధానాన్ని అనుసరించబోతున్నట్లు టాక్. ఈ సంవత్సరం ‘క్రాక్’ మూవీని సంక్రాంతికి వారంరోజులు ముందుగా విడుదల చేసారు. ఇప్పుడు అదేవిధానాన్ని అనుసరించి సంక్రాంతికి ఒక వారం ముందుగా ‘ఆచార్య’ ను తీసుకు వస్తే సంక్రాంతి సినిమాలకు అడ్డు ఉంటుందని ఎవరు భావించారని చిరంజీవి ఇమేజ్ రీత్యా ఈమూవీకి సంక్రాంతి పండుగతో సంబంధం లేకుండా ముందు విడుదల అయితే మొదటివారం చిరంజీవి ఇమేజ్ వలన వచ్చే భారీ కలక్షన్స్ ఆతరువాత వచ్చే సంక్రాంతి పండుగ బోనస్ అని చెప్పి ఈమూవీ బయ్యర్లకు ‘ఆచార్య’ ను భారీ రేట్లకు అమ్మాలని ఈమూవీ నిర్మాతల వ్యూహం అని అంటున్నారు.

అయితే ఊహించిన విధంగా ‘ఆచార్య’ సంక్రాంతికి ముందుగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుని నిలబడితే మహేష్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ ల సంక్రాంతి సినిమాలకు ధియేటర్లు కొరత ఏర్పడుతుంది కదా అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘ఆచార్య’ కు అమావాస్య సెంటిమెంట్ ను పక్కకు పెట్టి దీపావళికి మంచిది అంటూ మరికొందరు ఈమూవీ నిర్మాతలకు సలహాలు ఇస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: