దర్శకధీరుడు రాజమౌళిని కొట్టిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ జక్కన్న అలియాస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రీకరించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నారు. అంతేకాదు.. బాహుబలి ద్వారా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. కాగా.. సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళిని రైటర్ విజయేంద్రప్రసాద్ రాజమౌళి పై చేయి చేసుకున్నారంట. చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాజమౌళిని కొట్టాల్సిన అవసరం విజయేంద్ర ప్రసాద్ కు ఎందుకు వచ్చింది.. అసలు ఎందుకు కొట్టారో ఒక్కసారి చూద్దామా.
అయితే విజయేంద్రప్రసాద్ స్వయానా రాజమౌళి నాన్న. ఇక చిన్నప్పుడు రాజమౌళి ఓ విషయంలో తప్పు చేయడంతో తనపై చేయి చేసుకున్నట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే రాజమౌళి చిన్నతనంలో ఆడుకుంటూ వరుసగా వెళ్తున్న చీమలన్నింటిని ఒక్కొక్కటిని నలిపి చంపేస్తున్నారంట. కాగా.. అది చూసిన విజయేంద్రప్రసాద్ రాజమౌళి వీపుపై ఒక్కటి వేశాడంట. ఇక ఇలా విజయేంద్రప్రసాద్ కొట్టడంతో రాజమౌళి గట్టిగా ఏడ్చారంట.
రాజమౌళి అసలు ఎందుకు కొట్టానో తెలుసా అని తన తండ్రి అడిగినప్పుడు తెలియదు అని సమాధానం చెప్పరంట. అయితే మరి ఎందుకు అంత గట్టిగా ఏడుస్తున్నావని విజయేంద్రప్రసాద్ అడగగా.. నొప్పిగా ఉందనే సమాధానం చెప్పుకొచ్చారంట. కానీ.. ఒక్కదెబ్బ కొట్టగానే నొప్పితో ఇంత బాధ పడుతున్నావు.. మరి నువ్వు చీమలను నలిపి చంపేస్తున్నప్పుడు అది ఎంత బాధపడి ఉంటాయో తెలుసా అంటూ తన కొడుకు అర్థమయ్యే విధంగా చెప్పుకొచ్చారంట.
ఇక కేవలం చీమలను మాత్రమే కాదు ఇతరులని ఎప్పటికీ నొప్పించకూడదు అంటూ తన కొడుకుకి హితబోధ చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాలన్నీ రాజమౌళికి చిన్నప్పటి జ్ఞాపకాలే కావొచ్చు.. అయ్యినప్పటికీ విజయేంద్ర ప్రసాద్ లోని గుణాలకు అద్దం పట్టడమే కాకుండా కొడుకును పెంచే విధానం, ఇతరులతో ఏ విధంగా మెలగాలన్న విషయాలను కూడా విజయేంద్రప్రసాద్ రాజమౌళికి ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఎంతో క్రమశిక్షణగా పెంచారని అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: