నాగార్జునను అలెర్ట్ చేస్తున్న జూనియర్ అభిమానుల ప్రచారం !

Seetha Sailaja

‘బిగ్ బాస్ సీజన్ 5’ ప్రారంభం అయి కనీసం ఒక వారం కాకుండానే ఈ షోపై నెగిటివ్ కామెంట్స్ తో కూడిన ప్రచారం సోషల్ మీడియాలో ప్రారంభం కావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ షోను హోస్ట్ చేసే విషయంలో చాల యాక్టివ్ గా కనిపిస్తున్నా కొందరికి మాత్రం అతడి హోస్టింగ్ నచ్చలేదు అన్న ప్రచారం మొదలైంది.

నాగార్జున హోస్టింగ్ రొటీన్ గా ఉందని కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీరంతా మరో అడుగు ముందుకు వేసి ‘బిగ్ బాస్ సీజన్ 6’ ను జూనియర్ తో హోస్ట్ చేస్తే బాగుంటుందని సీజన్ 5 ప్రారంభం అయి మూడు రోజులు అవ్వకుండానే ఒక విచిత్రమైన ప్రచారం మొదలైంది అని వార్తలు రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

ఇక లేటెస్ట్ గా మొదలైన ‘బిగ్ బాస్ సీజన్ 5’ హౌస్ మేట్స్ ఎంపిక ఏమాత్రం బాగాలేదు అంటూ మరికొందరు నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియాలో మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ‘బిగ్ బాస్ సీజన్ 5’ లాంచింగ్ కార్యక్రమానికి ఊహించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదని మరికొందరు సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి జూనియర్ ‘రామారావు’ గా మారి కొన్ని వారాల క్రితం మొదలుపెట్టిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోను తారక్ అభిమానులు అందరు బాగా చూస్తే ఆ షోకి ఇప్పటికే భారీ రేటింగ్ వచ్చి ఉండేది. అయితే తమ అభిమాని హీరో హోస్ట్ చేస్తున్న షో గురించి పట్టించు కోకుండా కొంతమంది తారక్ అభిమానులు నాగార్జున ‘బిగ్ బాస్ సీజన్ 5’ పై కామెంట్స్ చేయడమే కాకుండా ఆ షోకి జూనియర్ హిస్ట చేస్తే బాగుంటుంది అంటూ ఒక విచిత్ర ప్రచారాన్ని ఎందుకు ప్రారంభించారు అన్నది సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: