ఆ సినిమాలో సుకుమార్ రాంచరణ్ వద్దన్నా ఆ పనిచేయించాడా...?

murali krishna
దర్శకుడు సుకుమార్ కథనం తీసుకున్న శ్రద్ధ చాలా కొత్తగా ఉంటుంది.ఆయన తీసిన రంగస్థలం సినిమా ప్రేక్షకులను మెప్పించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర తీరు అందరిని అలరించింది. ఆయన నటన కూడా ఓ ట్రెండ్ సెట్ చేసిందని తెలుస్తుంది. చెవిటి వాడి పాత్రలో ఒదిగిపోయారని చెప్పొచ్చు. అందులో లీనమైపోయాడని సమాచారం. ఇక రాంచరణ్ సమంత ల నటన కూడా ఓ మైలురాయి అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో రాంచరణ్ సమంతల మధ్య ముద్దు సన్నివేశం కూడా అందరి దృష్టిని బాగా ఆకట్టుకుందట.
దర్శకుడు సుకుమార్ మొదట కథ చెప్పేటప్పుడు ఈ సీన్ గురించి అస్సలు చెప్పలేదని సమాచారం. తరువాత చెప్పినా రాంచరణ్ అందుకు ఒప్పుకోకపోవడంతో సుకుమార్ ఆయనను ఒప్పించడానికి నానా తిప్పలు పడినట్లు సమాచారం. ముద్దు సన్నీవేశం సినిమాను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చెప్పారట. చివరికి చరణ్ ను ఓకే చెప్పించడానికి నానా తంటాలు పడ్డాడని సమాచారం.సమంత పెదాల దగ్గరకు వస్తే చాలు ఎడిటింగ్ లో సెట్ చేసుకుంటామని చెప్పి సరే అనిపించాడని తెలుస్తుంది.తన భార్య ఉపాసనకు ముద్దు సీన్ ఉంటే నచ్చదని చెప్పేశాడని సమాచారం. కానీ చివరికి దర్శకుడి కోరికతో సరే అని అన్నారట.
సన్నివేశం చిత్రీకరణ మొదలు అయ్యాక ఒక్కసారి సమంత తన పెదాలతో రాంచరణ్ పెదాలకు తాకించడంతో చరణ్ అవాక్కయ్యాడని సమాచారం. దీంతో సుకుమార్ పై అలిగాడని వార్త వినిపిస్తుంది. తనకు ఇష్టం లేకున్నా ముద్దు సీన్ లో నటించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడని సమాచారం. కానీ సినిమాకు ఆ సన్నివేశం ఎంత ముఖ్యమో దర్శకుడికి తెలుసు కాబట్టే దానికి ఇద్దరిని ఒప్పించినట్లు సమాచారం.కానీ సినిమా విజయంలో ముఖ్య పాత్ర వహించిన ముద్దు గురించి అప్పట్లో పెద్ద సంచలనమే అయిందట.
తన సినిమాల్లో ఎక్కడ కూడా అలాంటి సీన్ లు ఉండకూడదనే జాగ్రత్త పడుతుంటాడట రామ్ చరణ్. కానీ ఈ సినిమాకు మాత్రం దానికి ఒప్పుకోక తప్పకపోయే సరికి మనసులోనే బాధ పడినట్లు సమాచారం. భవిష్యత్ లో ఇలాంటి సన్నివేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కానీ సినిమా విజయంలో కీలక ఘట్టాలను వద్దంటే ఎలా అని దర్శకుడు రాంచరణ్ ను తరువాత దానికి ఒప్పించేందుకు చాలా కష్ట పడ్డాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: