అనుష్క, నవీన్ పొలిశెట్టి సినిమా కథ లీక్..!

shami
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు రెండు సూపర్ హిట్లు అందుకున్న నవీన్ పొలిశెట్టి తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన స్వీటీ అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది. నిశ్శబ్ధం తర్వాత కొద్దిపాటి గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా ఇదే. మహేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కథ ఇదే అంటూ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది. నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ కథతోనే ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.
పెళ్లంటే అసలు ఇష్టం లేని అమ్మాయి.. తల్లి అవడం కోసం ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్ పద్ధతి ఫాలో అవ్వాలని అనుకుంటుందట. దానికోసం స్టాండ్ అప్ కమెడియన్ అయిన హీరో వీర్యం తీసుకుంటారట. ఆ తర్వాత ఏమైంది అన్నది సినిమా కథ అని తెలుస్తుంది. ఇదేదో వికీ డోనార్ సినిమా కథకు దగ్గరగా ఉన్నా సరే హీరోయిన్ సెంట్రిక్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. అందుకే అనుష్క ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. ఇక అనుష్క సినిమాలో మేల్ లీడ్ అనగానే నవీన్ పొలిశెట్టి కథ కూడా అడగకుండా ఓకే చేసి ఉంటాడని అంటున్నారు.
యువ హీరోగా కెరియర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో హ్యాట్రిక్ మీద గురి పెట్టాడని చెప్పొచ్చు. సినిమాలో అనుష్క ఉంది అంటే ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చినట్టే. నిశ్శబ్ధం నిరాశపరచడంతో అనుష్క కూడా మంచి కథతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటుంది. ఇదే కాకుండా మరో కమర్షియల్ సినిమాలో కూడా అనుష్క నటిస్తుందని అంటున్నారు. ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. అనుష్క మళ్లీ తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది. కథల విషయంలోనే అమ్మడు ఆచితూచి అడుగులు వేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: