ఆ అవార్డుతో రికార్డు సృష్టించిన మహానటి..

Divya

మహానటి చిత్రాన్ని అప్పటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, అశ్వినీ దత్ ,స్వప్న దత్, ప్రియాంక దత్ లు  నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా వైజయంతి మూవీ, స్వప్న సినిమా బ్యానర్ కింద 2018 మే 9 న విడుదల చేశారు.. ఇందులో సావిత్రి పాత్రలో నటి కీర్తి సురేష్ నటించి, నిజంగా మహానటి  సావిత్రి వచ్చి నటిస్తోందేమో అన్నట్టుగా పరకాయప్రవేశం చేసి మరీ కీర్తి సురేష్ ఇందులో నటించింది. ఇందులో దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని , విజయ్ దేవరకొండ రాజేంద్రప్రసాద్, భానుప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు.. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు..
అప్పట్లో మహానటి సావిత్రి ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది . ఆమె జీవితంలో ఎలా ఎదిగింది?  అని అంశాలతో ఆమె జీవిత కథను తెరకెక్కించడం జరిగింది. ఇందులో ఒక ప్రత్యేకం ఏమేమిటంటే,  "మాయా బజార్"  నాటకంలో, ఒక సన్నివేశంలో ఎడమ కంటి నుండి రెండు చుక్కల నీటి బిందువులు రావాలి. కేవలం రెండంటే రెండు చుక్కలు మాత్రమే ఎడమ కంటి నుండి రావాలని అప్పట్లో ఎస్.వి.రంగారావు సావిత్రి కి చెప్పారు. ఆమె ఖచ్చితంగా రెండే రెండు చుక్కలు తన ఎడమ కంటి లో నుంచి రాల్చింది. ఇక కీర్తి సురేష్ కూడా సహజంగా ఉండాలని , అందుకోసం  గ్లిజరిన్ కూడా వాడకుండా ఒక గంట పాటు ప్రయత్నించి, ఆమె కూడా ఎడమ కంటి నుండి రెండంటే రెండే కన్నీటి చుక్కలను రాల్చి, ఆమె ఈ సినిమాపై ఎంత ఎఫర్ట్ పెట్టిందో చెప్పకనే అందరూ తెలుసుకునేలా చేస్తుంది. ఇది చూసిన చిత్ర యూనిట్ అంతా షాక్ అయ్యారు.అంతలా పూర్తిగా జీవించేసింది కీర్తి సురేష్..
ఈ చిత్రం తెలుగు , తమిళంలో విడుదలైన మొదటి రోజే మంచి హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమాకు కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో  నిర్మించినగా , ఇక  ఎవరూ ఊహించని విధంగా మొత్తం 83 కోట్ల రూపాయలను వసూలు చేసి, రికార్డు సృష్టించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి, కాసుల వర్షం కురిపించింది. ఇక  2019 లో ఈ చిత్రానికి గాను 66వ నేషనల్ సినిమా అవార్డులలో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కీర్తిసురేష్. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డును  కూడా అందుకుంది ఈ  చిత్రం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: