నితిన్ చెక్ చేసుకోలేదా.. మళ్ళీ ట్రాక్ తప్పాడే..?
కొత్తగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్లో పెట్టడంతో నితిన్ ఈసారైనా నిలకడ చూపిస్తాడని ఆశించారు అభిమానులు. కానీ వారికి మళ్లీ నిరాశ తప్పలేదు.నితిన్ నటించిన చెక్ సినిమా ఇటీవలే ప్రేకహకుల ముందుకు వచ్చింది. వీకెండ్లోనే ఈ సినిమా ఆశించిన వసూళ్లు రాబట్టలేదు. తొలి రోజు వరల్డ్ వైడ్ 3.7 కోట్ల షేర్‌తో పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజుల్లో తేలిపోయింది. ఈ రెండు రోజుల షేర్ రూ.మూడున్నర కోట్లకు అటు ఇటుగా ఉండటం గమనార్హం. ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటిదాకా రూ.7.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. నితిన్‌కు మంచి మార్కెట్ ఉన్న నైజాంలో రూ.2.4 కోట్ల షేర్ రాబట్టిన ‘చెక్’ మిగతా ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
‘ఉప్పెన’తో పోటీ, డివైడ్ టాక్ ఈ సినిమాను బాగానే దెబ్బ కొట్టినట్లుంది. ‘చెక్’ థియేట్రికల్ హక్కులు రూ.15.5 కోట్లకు అమ్మడం గమనార్హం. అందులో ఇప్పటిదాకా సగం కూడా వసూలు కాలేదు. వీకెండ్లోనే ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా.. ఇక వీక్ డేస్‌లో నిలబడటం అసాధ్యం.అని చెప్పొచ్చు.. ఇక మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్ లో నటిస్తున్నారు.. సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా ఒప్పుకోవడం ఇంకా పెద్ద రిస్క్..