ప్రపంచంలో ఏ హీరో కి దక్కని గుర్తింపు ఈ హీరో సొంతం..?

P.Nishanth Kumar
ఒకప్పుడు హీరోలు ఎలా ఉండేవారంటే ఏడాదికి తక్కువలో తక్కువ పది సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా చూసుకున్నారు. అలా ఇండస్ట్రీ లో వారికి ఎక్కువ పనిని ఇస్తూ ముందుకు వెళ్లారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు ఇలా ప్రతి హీరో దాదాపు పది సినిమాలు రిలీజ్ చేసి హిట్ లు కొట్టి దూసుకెళ్ళేవారు. కానీ రాను రాను సినిమా లో మార్పులు రావడంతో, సినిమా తీసే పద్ధతి మారడంతో సినిమా చేయడానికి లేట్ అవడంతో హీరోలు ఏడాదికి ఒక్క సినిమా ని చేయడమే గగనం అయిపొయింది.
ఈరోజుల్లో సంవత్సరానికి ఒక్క సినిమా తెస్తేనే గొప్ప విషయం.. మీడియం రేంజ్ హీరోలు అయితే రెండు సినిమాలకు పరిమితమైపోతున్నారు.. మరీ చిన్న హీరోలు అయితే మూడేసి సినిమా లు చేస్తున్నారు.. ఇండస్ట్రీ ఏదైనా హీరోలు మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారు. ఒక్క సినిమా చేసి చేతులెతేస్తున్నారు.. అయితే వీరందరికి భిన్నంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సినిమాలను లైన్ లో పెట్టాడు ఓ మలయాళ హీరో.. రాబోయే మూడు ఏళ్లలో ఆ హీరో చేయబోతున్న ఆ సినిమాల జాబిత ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మలయాళ స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న పృథ్వీ రాజ్ వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. కేవలం మలయాళంలోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియా అటు నార్త్ ఇండియాలో కూడా గుర్తింపు పున్న హీరో పృథ్వీరాజ్ ఏకంగా 30 సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రపంచంలో ఏ హీరో కూడా ఒకే సారి 30 సినిమాలకు కమిట్ అవ్వడం చూసి ఉండరు. పృథ్వీ రాజ్ ఏదో పై మాటకు సినిమాలకు కమిట్ అవ్వడం కాదు. అందులో ఇప్పటికే కొన్ని టైటిల్స్ ఫిక్స్ అయ్యాయి. మరి కొన్ని స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్నాయి. ప్రతి సినిమాకు డేట్ ఖరారు అయ్యి ఉంది. కనుక పృథ్వీ రాజ్ ఆ 30 సినిమాల్లో ఏ ఒక్కదాన్ని కూడా వదిలే ఛాన్స్ లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: