మెగాస్టార్ పిలిచి ఛాన్స్ ఇచ్చాడట.. దేవి ఇక కుమ్మేస్తాడా..!

shami
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే రాం చరణ్ కు సంబందించిన సీన్స్ షూట్ చేస్తారట. ఇక ఇదిలాఉంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
ముందు సాహో డైరక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తాడనుకున్న ఈ సినిమాను వినాయక్ చేతుల్లో పెట్టారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఖైది నంబర్ 150 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన సైరా సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు. ఆచార్య సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇప్పుడు లూసిఫర్ రీమేక్ కు దేవి శ్రీ ప్రసాద్ ను దించుతున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ కు చిరు పిలిచి మరి ఛాన్స్ ఇస్తున్నాడు. మరి ఈసారి దేవి అసలు టాలెంట్ ఏంటన్నది చూపిస్తాడేమో చూడాలి. ఈమధ్య డిఎస్పి మ్యూజిక్ ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. ఈ టైం లో చిరు ఛాన్స్ రావడం లక్కీ అని చెప్పొచ్చు. దేవి కొద్దిగా వెనక్కి తగ్గగా ఈ గ్యాప్ లో థమన్ ఫుల్ ఫాం లోకి వచ్చాడు. మరి లూసిఫర్ రీమేక్ కు దేవి మ్యూజిక్ ఏమాత్రం హెల్ప్ అవుతుందో చూడాలి.                                                      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: