అక్కినేని కోడలు సమంత మెయిన్ రోల్లో ఈ యేడాది నటించిన సినిమా ఓ బేబీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఏపీ, తెలంగాణలో ఫుల్ రన్ లో 12.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసి, వరల్డ్ వైడ్ గా 18.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అందరికీ లాభాలను తెచ్చి పెట్టింది. నందినిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాస్తవంగా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నందినిరెడ్డికి సరైన హిట్స్ లేవు.
ఇక మార్కెట్ పరంగా చూస్తే అప్పట్లో ఆమెకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా ఓ బేబీ మేకర్స్ ముందుకు రాలేదు. అప్పుడు ఆమెకు శాలరీ బేస్ మీద అమౌంట్ ఇచ్చి... ఆ కండీషన్ మేరకు సినిమా పూర్తి చేయించుకున్నారు. సినిమా హిట్ అయితే ప్రాఫిట్స్ నుంచి రెమ్యునరేషన్ ఇస్తానని నిర్మాతలు నందిని రెడ్డితో డీల్ కుదుర్చుకున్నారు.
సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అన్నీ లెక్కులు వేసి ఆమెకు రు. కోటి రెమ్యునరేషన్ ఇచ్చారట. రెమ్యునరేషన్ పరంగా నందిని రెడ్డి కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ అమౌంట్ అని చెప్పాలి. నిర్మాతలు ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు రెమ్యునరేషన్ ఇవ్వడంతో ఆమె చాలా హ్యాపీగా ఉన్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమా హిట్ అయిన జోష్‌లో నందిని రెడ్డి వెంటనే స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఓ భారీ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఇందులో నాని హీరోగా నటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే నందిని రెడ్డి ఇటీవలే నెట్ ఫ్లిక్స్ కి చేస్తున్న లస్ట్ స్టోరీస్ అనే ఆంథాలజీ స్టోరీలోని ఒక పార్ట్ షూట్ ని కూడా ఫినిష్ చేశారు. ఏదేమైనా వరుస ప్లాపులతో డీలా పడ్డ నందినిరెడ్డి తిరిగి ఓ బేబీతో ఫుల్ జోష్‌లోకి వచ్చింది. మరి ఈ హిట్ ట్రాక్‌ను ఆమె కంటిన్యూ చేస్తుందేమో ? చూడాలి.