కీర్తి సురేష్ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

సర్కార్  తరువాత  కొంచెం  గ్యాప్ తీసుకున్న రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్  ప్రస్తుతం  నాలుగు సినిమాలకు సైన్ చేసింది.  అందులో భాగంగా  తెలుగులో  కీర్తి   ఇక్బాల్ ఫేమ్  నగేష్ కుకునూరు డైరెక్షన్లో  నటిస్తుంది.  ఈ చిత్రానికి 'గుడ్ లక్ సఖి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. స్పోర్ట్స్  బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  కీర్తి , షూటర్ గా నటిస్తుండగా  స్టేజ్ యాక్టర్ గా ఆది పినిశెట్టి  అలాగే కోచ్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.   ఈచిత్రం తోపాటు  తెలుగులో కీర్తి , మిస్ వరల్డ్ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా నటిస్తుంది. నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.  మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది.  వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. ఇక  ఆమె ఈ చిత్రంతో పాటు  కోలీవుడ్ లో  పేట ఫేమ్ కార్తీక్  సుబ్బరాజు నిర్మాణం లో  పెంగ్విన్  అనే  చిత్రంలో నటిస్తుంది.  ఓ నూతన దర్శకుడు  డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రం కూడా  లేడీ ఓరియేంటేడ్ మూవీ నే కావడం విశేషం. వీటితోపాటు  కీర్తి సురేష్  ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవగన్  సరసన  మైదాన్  అనే చిత్రంలో నటిస్తుంది. బడాయి హో ఫేమ్ అమిత్ శర్మ  డైరెక్ట్  చేస్తున్న ఈ చిత్రం  ఫుట్ బాల్  నేపథ్యం లో  తెరకెక్కుతుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్  ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నాడు.  కాగా కీర్తి కి బాలీవుడ్ లో ఇదే మొదటి చిత్రం.  అలా  కీర్తి  రెండు లేడీ ఓరియెంటెడ్  సినిమాలతో అలాగే  రెండు  స్పోర్ట్స్  బ్యాక్ డ్రాప్ సినిమాలతో  ఫుల్  బిజీగా వుంది.  మరి ఈచిత్రాలు ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: