వ‌యొలెంట్‌ గా ధానుష్ కొత్త సినిమా

Rakesh Singu
ధ‌నుష్‌ త‌మిళ హీరో అయినా కూడా ఇండియాలోని చాలా మంది సినీ ప్రేమికులకు సుపరిచితుడు. తెలుగులో ఆయనకు భారీ హీట్లు లేకపోయిన కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.మామూలుగా హీరో అంటే అందరికి ఎత్తు, బాడి ఉండాలి అని  కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ ధనుష్ విషయంలో అవి మినహయింపు ఎందుకంటే ఆయన "నటన"తో అందరిని ఆకట్టుకుంటాడు.ఆయన విభిన్న కథాంశాలను ఎన్నుకోవడం మాత్రమే  కాదు ఆ పాత్రల్లో జీవిస్తాడు. శరీరాకృతి ధనుష్ కు పెద్ద వరం అందువల్ల ధనుష్ 18 ఎళ్ళ కుర్రాడి లా  కనబడగలడు,40 ఎళ్ళ వాడిలా కనబడటం మత్రమే కాదు అందరిని మెప్పించగలడు.
ప్రస్తుతం  నేషనల్ అవార్డు విన్నింగ్ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్‌తో "అసుర‌న్" అనే సినిమా చేస్తున్నాడు.వీళ్ల క‌ల‌యిక‌లో వస్తున్న నాలుగో చిత్ర‌మిది.వీళ్ళిద్దరి కలయికలో గత ఏడాది "వ‌డ చెన్నై" సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
ఇంత‌కుముందు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన  ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు మంచి ఆదరణ లభించింది. . ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో మ‌ధ్య వ‌య‌స్కుడిగా నుదుటన విబూది పెట్టుకొని నవ్వుతూ క‌నిపిస్తున్నాడు ధ‌నుష్‌.
ఇప్పుడు సెకండ్ లుక్ లాంచ్ చేశారు.  సెకండ్ లుక్ యువ‌కుడిగా క‌నిపిస్తున్నాడు. ధనుష్ చేతిలో కత్తి ఉంది మరియు కోపంగా ఆరుస్తున్నాడు. ఈ సినిమా ఒక వ‌యొలెంట్‌ రీవెంజ్ డ్రామాగా కనబడుతుంది.వీళ్ల క‌ల‌యిక‌లో వచ్చన ముందు సినిమాలు చాలా వ‌యొలెంట్‌ ఉంటాయి. మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్‌తో ధ‌నుష్ ఈ సినిమాలో జ‌త క‌డుతుండ‌టం విశేషం. ఇది ఆమె కు మొదటీ తమిళం సినిమా.బాలాజీ శక్తివేల్, పసుపతి, ప్రకాష్ రాజ్ మరియు యోగి బాబు లు ఇతర ప్రధాన పాత్రల్లో కనబడుతున్నారు.  ఈ సినిమా దసర కానుకగా అక్టబర్ 2వ ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: