ప్రముఖ దర్శకుడి పై కులపిచ్చిగాళ్ళ దాడి - దేశమంతా ఇంతే


మన రెండు రాష్ట్రాలు బాగుచేయటానికి వీలు లేనంతగా కుల గజ్జితో కుళ్ళి కంపు కొడుతున్నాయి. మన రాష్ట్రాలే కాదు ఆ సేతు సీతా చలం భారత దేశమంతా కుల వివక్ష తో కుళ్ళి కునారిల్లుతుంది. సిగ్గుమాలిన రాజకీయ నాయకులు మామూలుగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. కాని దరిద్రం ఏమిటంటే వాళ్ళే ప్రజలంతా కట్టకట్టుకొని ఏబేధ భావం లేకుండా ఓటేసి అధికారం లోకి తెచ్చినా కూడా కులం తోనే గుర్తింపబడాలనే సంకుచిత దృక్పధంతో కుంచించుకు పోతున్నారు.



ఉదాహరణకు ఖమ్మం జిల్లా కు చెందిన తుమ్మల నాగేశ్వరరావు అనే తెలంగాణా శాసనసభ్యుడు, మంత్రివర్యులు, కులం వారిచేత నిర్వహించిన కార్తీక  వన భోజన సమారాధనకు వెళ్ళారు. తప్పులేదు తన కుటుంబం తన బందువులు చివరకు సామాజికంగా తన కులం వాళ్ళు నిర్హించిన కార్యక్రమానికి వెళ్లి వారితో భోజన తాంబూలాదులు స్వీకరించటం. దానికి ఆయన్ని అభినందిద్ధాం. కాని ఆయన అక్కడ ఉపన్యసించిన తీరు ఆయనమాటల్లోనే చెప్పటానికి మనకు అసహ్యంగా అని పిస్తున్నా చెప్పితేనైనా ఆయనికి ఆయన్ని నమ్మిన ఆయన కులం వాళ్ళకి సిగ్గైనా వస్తుందని చెప్పక తప్పట్లేదు.



కార్తీక వన సమారాధన వెళ్ళిన అయన కమ్మ కులం పై చేసిన వ్యాఖ్యలే తెలంగాణా ప్రజలని నివ్వెరపరుస్తున్నాయి. "మన కమ్మకులమే ఒక ప్రత్యేకత కలిగిన విశిష్ఠమైన కులమని దాన్ని ఆ సర్వాంతర్యామి ఆ కుల జనావళిని ప్రత్యేక శ్రద్ధతో సృష్టించారని దాన్ని అర్ధం చేసుకొని మన కుల జనం ఎక్కడౌన్నా ఎలాఉన్నా ఒకరికి ఒకరం సహకరించుకుంటూ కలసి ఉంటూ పనిచేస్తూ మనమే బాగా అభివృద్దిలోకి రావాలని కోరుతున్నాను" అని అన్నారు. ఈ మాటలే తుమ్మల నాగేశ్వరరావు అతి నీచమైన గుణాన్ని, కుల మధాంధకారాన్ని మనందరికి బహిరంగ పరుస్తుంది. అసలే కులగజ్జితో సతమత మయ్యే మనరాష్ట్రాల్లో ఇలాంటి అధికారం లో ఉన్న వాళ్ళు బహిరంగ ప్రచారం మొదలెడితే మన జాతే పతనమౌతుంది.



కోడేల శివప్రసాదరావు అనే తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, అంధ్రప్రదేశ్ శాసనసభలో సభాపతి కూడా అయిన ఆయన తమ సామాజిక తరగతి  కమ్మ కులానికి చెందిన దైవ కార్యానికి-ద్వారకా తిరుమల మార్కెట్ యార్డ్ కు విచ్చేసిన సంధర్భంలో:



“తమ కులం వాళ్ళు సామాజికంగా ఎంతో అభివృద్ది చెంది కష్టపడి ఐకమత్యం తో రాజకీయ అధికారాన్ని చేజిక్కించు కున్నారని రాజకీయంగానే కాకుండా పారిశ్రామికంగా, వణిక వ్యాపార పరంగా, వ్యవసాయ, విద్య, ఆరోగ్య, ఆర్ధిక, న్యాయ, అధికార, సినిమా, మీడియా రంగాలను ఆక్రమించి ప్రముఖులుగా ఎదిగారు. సంఘంలో మనకు ఎదురులేదు. అనేకులు విదేశాల్లో స్థిరపడి వలస వాదులు గా ఉండి ఎంతగానో అన్నీ రంగాల్లో ఎదిగిపోతున్నారు. అంతేకాదు మనం మనకు లభించిన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటూ ముందుకు సాగాలని-”  అని ప్రసంగించారు. తనకు జరిగిన అభినందన కార్యక్రమం లో కృతజ్ఞతగా గౌరవ అతిధి సత్కారాలను స్వీకరించారు, 



ఇది మన రెందు రాష్ట్రాల్లో జరిగిన ఒకే కుల గుల. ఇదే గుల అన్నీ కులాలకూ ఉండే ఉంటుందనటంలో సందేహం లేదు. మీరు పరిశీలిస్తే అమరావతి ని ఇతర రాష్ట్రాలే కాదు మనవాల్లే మనస్పూర్తిగా నమ్మరు. కారణం మీరొకసారి అధికారంలో ఉన్నత స్థాయి అధికారులు, పదవుల్లో అధికారం చెలాయించగల స్థానాల్లో ఉన్నవాళ్ళు, న్యాయ స్థానాల్లో న్యాయం గతిని మార్చగల స్థానాల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నత స్థితిని సాధించిన వాళ్ళెవరో తెలుస్తుంది. ఇది సర్వ సత్తాక గణ తంత్ర ప్రజాస్వామ్యం పేరుకే. కొన్ని కులాలవాళ్ళు అధికారము లోకి రావటంకాదు దానికి దారి దాపులకు కూడా రాలేకపోయే పరిస్థితికి కారణం అర్ధం చేసుకోవటం చాలా అవసరం.


కులపిచ్చి జాఢ్యం రోజురోజుకి ముదిరి పాకాన పడి పోతున్దనడానికి ఇది తాజా ఉదాహరణ. తమ కులానికి చెందిన ఒక రాణి కథని అశ్లీలంగా చెబుతున్నాడనే ఆరోపణలతో బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు "సంజయ్‌ లీలా భన్సాలీ" ని పట్టుకుని చితక్కొట్టారు" రజపుత్ కర్ణి సేన" 'పద్మావతి' చిత్రం సెట్స్‌ మీదకి రాజ్‌పుట్లత్ కి చెందిన ఒక సంఘ ప్రతి నిధులు. పెద్ద సంఖ్యలో వెళ్లి దాడి చేశారు.



"రాణీ పద్మిని" పై శృంగార సన్నివేశాలు తీస్తున్నారంటూ ఆరోపణలు చేసారు. షూటింగ్‌ స్పాట్‌ లోని సెట్-ప్రోపర్టి ఇతర సామాగ్రి అంతా ధ్వంసం చేసి, దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ని జుట్టు పట్టుకుని కొట్టారు. పోలీసులు, మీడియా అక్కడికి చేరుకునే సరికే జరగాల్సిన విధ్వంసం జరిగింది. అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఎదురు తిరిగి తన చెలికత్తె లతో సహా ఆత్మాహుతి కి పాల్పడిన అభిమానవతి రాణి పద్మిని కథ తో ఈచిత్రం తెరకెక్కుతోంది.



ఇందులో పద్మావతిగా దీపికా పడుకోన్‌, ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. ఈ ఇద్దరు జంటగా నటిస్తున్నారని, ఖచ్చితంగా వీరిపై శృంగార సన్నివేశాలుంటాయని రాజ్‌పుట్‌ కర్ణి సేన ఆరోపిస్తోంది. వెంటనే షూటింగ్‌ ఆపేయాలనే డిమాండ్‌తో పద్మావతి సెట్స్‌పై దాడికి పాల్పడింది.

భన్సాలీపై దాడిని తీవ్రంగా ఖండించిన బాలీవుడ్‌ ప్రముఖులు సినీ పరిశ్రమ అంతా సంఘటితం కావాల్సిన తరుణమిది అంటూ పిలుపునిచ్చారు. కులజాఢ్యం అనే మహమ్మారి ఒక అద్భుత దర్శకుణ్ణి కించపరచటం దేశ శ్రేయస్సుకు మంచిదా! ఈ కుల జాడ్యం దక్షిణ భారతంలోనే ఉందనే వారికి ఉత్తర భారతం లో ఎలాఉంటుందో తెలుస్తుంది.


ప్రవచన రత్న బ్రహ్మర్షి చాగంటి కొటేశ్వరరావు గారు యాదవుల అగ్రహానికి గురయ్యారు. భారతం, భాగవతం లోని పలు సంఘటనలను ప్రవచనాల రూపంలో చెబుతుంటారు. సందర్భానుసారంగా పౌరాణిక ఘట్టాలను గుర్తుచేస్తూ వీక్షకులకు అర్థమయ్యే రీతిలో ప్రవచిస్తుంటారు. అయితే ఈ మధ్య చాగంటి తన ప్రవచనాల్లో యాదవులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్‌ మీడియాలో వివాదం చెలరేగింది. పలువురు యాదవ ప్రముఖులు కూడా చాగంటి పై పోలీసుల కు ఫిర్యాదు చేశారు. అయితే యాదవ సంఘం సభ్యులు కొంతమంది చాగంటి కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి వివరణ కోరారు. తన వ్యాఖ్యలపై యాదవ సంఘం సభ్యులకు చాగంటి వివరణ ఇచ్చారు.



ప్రవచనాల్లో తమను గొల్లలు అనకుండా యాదవులు అని సంబోధించాలని చాగంటిని యాదవ సంఘం సభ్యులు కోరారు. తప్పకుండా అలాగే చెప్తానని అన్నారు. యాదవుల మీద తనకు పరమపూజ్య భావన ఉందని, తనకు అసలు యాదవులంటే ఉన్నంత ప్రీతి ఎవరిమీదా లేదని చాగంటి చెప్పారు.యాదవుడైన శ్రీకృష్ణునిపై తనకు అంతులేనంత ప్రేమ ఉందని చెప్పారు. కావాలంటే యాదవులను కౌగిలించు కుంటానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ఏ ఛానెల్‌లో అయితే తన ప్రవచనాలను చూసి బాధపడుతున్నారో అదే ఛానెల్‌లో వివరణ కూడా ఇస్తానని చాగంటి చెప్పారు. అయితే ఆ చానల్ యజమాని కూడా తుమ్మల, కోడెల సామాజిక వర్గానికి చెందిన వారే నని తెలుస్తుంది. ఇది మన దేశపు దౌర్భాగ్యం, పాలకుల నీచత్వం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: