హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: షాద్‌నగర్ ఎమ్మెల్యే సేఫ్..బండ్ల రెడీగా ఉన్నారా?

ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఏదైనా ఉందంటే అది...అధికార టీఆర్ఎస్‌లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకేత ఎదురుకుంటున్నారనే టాపిక్. దాదాపు సగం మంది ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని వారికి నెక్స్ట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సీటు కూడా ఇవ్వరని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి.
అయితే ఇదే జిల్లాలో సేఫ్ జోన్‌లో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా సేఫ్ జోన్‌లో ఉన్నవారిలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కూడా ఒకరు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న షాద్‌నగర్‌లో అంజయ్య గులాబీ జెండా ఎగరవేశారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అంజయ్య ప్రజలకు అందుబాటులో ఉండటంలో ముందున్నారు. మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా ఈయన ప్రజల మధ్యలోనే ఎక్కువ ఉంటూ వస్తున్నారు. వారి సమస్యలని తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.


ఇక హైదరాబాద్ నగరానికి బోర్డర్‌లో ఉన్న ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బాగానే జరుగుతుంది. సి‌సి రోడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ భవనాలు, ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే షాద్ నగర్, గజ్వేల్, సంగారెడ్డి, చౌటుప్పల్, భువనగిరిలను హైదరాబాద్‌లో కలుపుతూ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు కానుండటంతో నియోజకవర్గానికి బెనిఫిట్ కానుంది. అదేవిధంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందివ్వడంలో ముందున్నారు. సాగునీరు సమస్యలు చాలావరకు తొలగిపోయాయి.
అయితే తాగునీటి సమస్యలు ఇంకా పూర్తి స్థాయిలో తీరలేదు. నియోజకవర్గం శివారుల్లో పాఠశాలల అభివృద్ధి జరగాలి. సంక్షేమ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలని నిర్మించాల్సి ఉంది. రాజకీయంగా చూస్తే ఎమ్మెల్యేగా అంజయ్యకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ తరుపున ప్రతాప్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే స్ట్రాంగ్‌గా ఉండటంతో కాంగ్రెస్‌కు ఛాన్స్ దొరకడం లేదు. ఇక కాంగ్రెస్ సీటు కోసం సినీ నటుడు బండ్ల గణేశ్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి పెద్ద బలం ఏమి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: