హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కమ్యూనిస్టుల కోటలో కారు ఎమ్మెల్యే హవా..
ఇక 2018 ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే జరిగింది. ఈ పోరులో టీఆర్ఎస్ తరుపున రమావత్ రవీంద్ర కుమార్ విజయం సాధించారు. అయితే ఈయనే సిపిఐ తరుపున గతంలో రెండుసార్లు గెలిచారు. కానీ రాను రాను సిపిఐకి ఆదరణ తగ్గడంతో టీఆర్ఎస్లోకి వెళ్ళి 2018లో గెలిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో నియోజకవర్గంపై రవీంద్రకు మంచి పట్టు ఉంది. అలాగే ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. పైగా అధికారంలో ఉండటంతో ఆ సమస్యలని పరిష్కరించడానికి గట్టిగానే కృషి చేస్తున్నారు.
నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు...అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతం కావడంతో నియోజకవర్గంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దేవరకొండ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా మారిన సరే అభివృద్ధిలో మార్పు లేదు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అలాగే అండర్ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. అలాగే రూరల్ ప్రాంతంలో రోడ్ల సౌకర్యం కూడా అంతంత మాత్రమే. అలాగే విద్యా, వైద్య సదుపాయాలు అనుకున్న స్థాయిలో లేవు.
రాజకీయంగా చూస్తే...దేవరకొండలో టీఆర్ఎస్ బలంగానే ఉంది...అదే సమయంలో కాంగ్రెస్ కూడా పికప్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో గానీ కమ్యూనిస్టులు జతకడితే...కారుకు డ్యామేజే..లేదంటే మళ్ళీ దేవరకొండ కారు సవారీ జరుగుతుంది.