హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: హఫీజ్‌కు ఓకే...కానీ?

కర్నూలు జిల్లాలో చాలావరకు వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గానే ఉన్నారు...గెలిచి రెండున్నర ఏళ్ళు అయినా సరే పెద్దగా వ్యతిరేకతని మూటగట్టుకోలేదు. ఎందుకంటే కర్నూలు ప్రజలు వైసీపీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అందుకే మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు సిటీ నుంచి తొలిసారి గెలిచిన హఫీజ్ ఖాన్ సైతం స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన హఫీజ్‌కు రాజకీయాలు కాస్త కొత్త..కానీ గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సిటీ నుంచి గెలిచేశారు.
                                                             
రాజకీయాల్లో కొత్త అయినా సరే ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజల్లోకి సులువుగా వెళ్లిపోతున్నారు. ప్రజల్లో కలిసిపోతూ...వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు...అలాగే ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలని ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నారు. అసలు ఈ రెండున్నర ఏళ్లలో ఎమ్మెల్యేగా హఫీజ్ బాగానే పనిచేశారని చెప్పొచ్చు. అటు కర్నూలు కార్పొరేషన్‌లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు.
ఇలా అన్నివిధాలుగా హఫీజ్ పర్వాలేదనిపిస్తున్నారు. కానీ హఫీజ్‌కు ఉన్న ఏకైక తలనొప్పి ఎస్వీ మోహన్ రెడ్డి..ఈయన కర్నూలులో సీనియర్ నేత. 2014లో వైసీపీ తరుపున సిటీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చేశారు. సిటీ టిక్కెట్ కోసం ట్రై చేశారు గానీ...జగన్ హఫీజ్‌కు సీటు ఇచ్చారు. అలాగే హఫీజ్ గెలవడం జరిగాయి.


కానీ ఆ తర్వాత నుంచే అసలైన వార్ మొదలైంది. నియోజకవర్గంలో ఎస్వీ కూడా డామినేషన్ చేయడం మొదలుపెట్టారు. ఆయన సెపరేట్‌గా రాజకీయం చేస్తున్నారు. ఎలాగో రెడ్డి వర్గం నేత కాబట్టి..తన వర్గం ద్వారా నెక్స్ట్ సిటీ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు హఫీజ్ ఏమో ఎస్వీకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. ఇలా వైసీపీలో అంతర్గత పోరు గట్టిగా జరుగుతుంది. ఇది టీడీపీ నేత టీజీ భరత్‌కు బాగా ఉపయోగపడుతుంది. వైసీపీలో ఉన్న లుకలుకలు భరత్‌కు కలిసొచ్చేలా ఉన్నాయి. చూడాలి మరి నెక్స్ట్ హఫీజ్ రాజకీయం ఎలా ఉంటుందో?  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: