నెయిల్ పాలిష్‌కు బ‌రువుకు లింక్ ఏంటి... బీ కేర్‌ఫుల్‌

Kavya Nekkanti
స‌హ‌జంగా ఈ మధ్యకాలంలో నెయిల్ ఆర్ట్‌కి బాగా క్రేజ్ పెరిగింది. రకరకాల నెయిల్ పాలిష్‌తో అమ్మాయిలూ క్రియేటివిటీగా ఎన్నో డిజైన్స్‌ని తమ గోర్లపై వేసుకుంటూ ఫ్యాషన్‌ ఐకాన్స్‌గా నిలుస్తున్నారు. అయితే, ఇలాంటి వారందరికీ ఓ చేదువార్తే.. అదేంటంటే తరచూ గోర్లరంగు వేయడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.. అందుకు కారణం.. నెయిల్ పాలిష్.. అమ్మాయిల గోర్లకి మరింత అందాన్నిచ్చే ఓ కాస్మొటిక్ ప్రొడక్ట్. ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


తాజాగా ఫేమస్ డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చిన విషయమేంటంటే.. ఎక్కువగా నెయిల్ పాలిష్ వాడడం వల్ల బరువు పెరుగుతారని తేలింది. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనంతో నెయిల్ పాలిష్‌ని తయారు చేస్తారు. ఈ రసాయనం ప్లాస్టిక్, ఫామ్ ఫర్నీచర్‌కి మంటలు అంటుకోకుండా వాడే ఈ రసాయనాన్ని నెయిల్ పాలిష్‌ ఎక్కువ రోజులు మన్నేందుకు వాడతారు. వీటిని వాడడం వల్ల మానవ హార్మోన్స్‌పై ప్రభావం పడతాయి. తద్వారా.. మనం బరువు పెరుగుతామని తేల్చారు.


ఇలాంటి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, వీటిని పెట్టుకున్న 10-14గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, చర్మానికి అంటుకోకుండా గోళ్లరంగు వేసుకుంటే అంతగా ఇబ్బంది ఉండదు.. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ నెయిల్స్‌కి పెట్టుకుని అతికించుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలుండవు. ఏదేమైనా నెయి‌ల్ పాలిష్ అధికంగా వాడితే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.. కాబట్టి బీకేర్‌ఫుల్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: