ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో.... అందరూ ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ పార్టీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ కాస్తుంటే... కాదు కాదు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది జోరుగా బెట్టింగులు చేస్తున్నారు. కొంతమంది అయితే మంత్రివర్గ విస్తరణ కూడా... తమ నాయకుడికి ఆ పదవి.. హోమ్ మంత్రి ప్రచారం చేస్తున్నారు వైసిపి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు.
ఇలాంటి నేపథ్యంలో... తాజాగా సోషల్ మీడియాలో కొంతమంది జోరుగా వార్త వైరల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి కచ్చితంగా వస్తుందని... ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కీలకంగా ఉన్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు.... హోం మంత్రి పదవి కూడా ఇస్తారని చెబుతున్నారు. ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం కూటమికి పడాలంటే.... జనసేన సపోర్ట్ ఉండాలి. అలాగే... ఏపీలో మొన్నటి ఎన్నికల్లో చాలావరకు సీట్లను పవన్ కళ్యాణ్ త్యాగం చేసేశాడు.
55 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాల్సిన పవన్ కళ్యాణ్... కేవలం 21 స్థానాలకు తగ్గాడు. ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అన్నట్లుగా... జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఈ త్యాగం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత...పవన్ కళ్యాణ్ కు కచ్చితంగా హోంమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పదవి వస్తుందని చెబుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ఓడిపోయి... వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే కూడా వేరే లెక్కలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే.... విడతల రజనికి హోం మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు.
బిసి సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు విడుదల రజిని. అందుకే ఈసారి ఆమెకు హోంమంత్రి ఇస్తారట. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా విడతల రజిని పనిచేశారు. ఇప్పుడు హోం మంత్రి కట్టబెట్టనున్నారట. ఒకవేళ ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయిన సరే... ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరి హోం మంత్రి చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఫలితాలు రాకముందే రెండు పార్టీల నాయకులు పదవులు డిసైడ్ అయిపోతున్నారు.