' రైజ్ ' స‌ర్వేతో తెలుగునాట పాపుల‌ర్‌ ' ప్ర‌వీణ్ పుల్లుట‌ '

RAMAKRISHNA S.S.
- క‌ర్నాక‌ట‌, తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపుపై 100 % స‌క్సెస్‌
- ఏపీలో కూట‌మి గెలుస్తుంద‌ని యేడాది ముందే చెప్పిన రైజ్‌
- కొడాలి నాని, వంశీ, రోజా, అంబ‌టి ఓట‌మిపై క్లారిటీ
( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
ఈ ఎన్నిక‌ల్లో బాగా వైర‌ల్‌, పాపుల‌ర్ అయిన స‌ర్వే సంస్థ‌ల‌లో తెలుగు నాట రైజ్ సర్వే బాగా వైర‌ల్ అయ్యింది. క‌ర్నాట‌క‌, తెలంగాణ‌లో ఈ సంస్థ నూటికి నూరు శాతం ఖ‌చ్చిత‌త్వంతో వేసిన అంచనాల‌తోనే క‌ర్నాట‌క‌, తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు అధికారంలోకి వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా ఈ సంస్థ సీఈవో ప్ర‌వీణ్ పుల్లుట ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌గ్ర‌మైన స‌ర్వేల‌తో గ‌త యేడాది కాలానికి పైగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మిస్ట‌ర్ ప్ర‌వీణ్ యూట్యూబ్ ఛానెల్లో ఎవ‌రు గెలుస్తారు.. ఎవ‌రు ఓడిపోతారు అనేదానిపై పూర్తి విశ్లేష‌ణ‌లు అందిస్తూ వ‌స్తున్నారు. ఇక ప‌లు స‌ర్వేల్లో కూట‌మిదే గెలుపు అని ప్ర‌వీణ్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చేశారు.

ప్ర‌వీణ్ తెలంగాణ‌లో ప‌లువురు అభ్య‌ర్థుల‌కు సెఫాల‌జిస్ట్‌గా ప‌నిచేసి స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏపీలోనూ వైసీపీ, ఇటు కూట‌మి త‌ర‌పున పోటీ చేసిన ప‌లువురు ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు ప‌ని చేశారు. తాము ప‌ని చేసిన అభ్య‌ర్థుల నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలాది శాంపుల్స్ సేక‌ర‌ణ ద్వారా చాలా కాన్ఫిడెంట్‌గా ఎవ‌రు గెలుస్తారో ? ఎవ‌రు ఓడిపోతారో చెపుతున్నారు. ఇక ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌న్న ప్ర‌వీణ్‌, పిఠాపురంలో ప‌వ‌న్ 35 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుస్తాడ‌ని చెప్పారు. తాము స్టూడియోల్లో కూర్చొని క‌బుర్లు చెప్పేవాళ్లం కాదు... డేటానే న‌మ్ముకుంటాం.. మా క్రెడిబులిటీ మాకు ముఖ్యం అని ఆయ‌న ఓపెన్‌గానే చెపుతున్నారు.

యేడాది క్రిత‌మే గుడివాడ నాని, గ‌న్న‌వ‌రం వంశీ ఓడిపోతాడ‌ని చెప్పిన వైనం..
ఇక ఏపీలోనే అత్యంత హాట్ సీట్లు అయిన గుడివాడ‌, గ‌న్న‌వ‌రం ఫ‌లితాలు యేడాది క్రిత‌మే ప్ర‌వీణ్ చెప్పారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని ఇద్ద‌రూ ఈ సారి ఓడిపోతార‌ని ఫ‌స్ట్ చెప్పింది ప్ర‌వీణ్ పుల్లుట‌. ఇక
కుప్పంలో 30 - 35 వేల మెజార్టీతో చంద్ర‌బాబు గెలుస్తాడ‌ని.. పులివెందుల‌లో మంచి మెజార్టీతో జ‌గ‌న్ గెలుస్తాడ‌ని... మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ 25 వేల పై చిలుకు మెజార్టీతో గెలుపు... ఉండిలో ర‌ఘురామ కృష్ణంరాజు గెలుపు క‌న్‌ఫార్మ్ చేశారు.

అలాగే వైసీపీ ప్ర‌ముఖుల్లో అంబ‌టి రాంబాబు, ఆర్కే రోజా, పేర్ని కిట్టు ఓట‌మి ప‌క్కా అని చెప్పారు.
ఇక మంత్రులు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, బాలినేనితో పాటు అవంతి శ్రీను, గుడివాడ అమ‌ర్నాథ్ ఓడిపోతార‌ని.. మరో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాత్రం గెలుస్తార‌ని చెప్పారు. ఇక యేడాది క్రితం కొడాలి నాని ఓడిపోతున్నాడ‌ని చెప్పిన‌ప్పుడు నాపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని.. వైసీపీ వాళ్లు బాగా టార్గెట్ చేశారు.. కానీ ఇప్ప‌ట‌కీ అదే మాట‌మీద నిల‌బ‌డి చెపుతున్నాను నాని, వంశీ ఇద్ద‌రూ ఖచ్చితంగా ఓడిపోతున్నార‌ని ప్ర‌వీణ్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు.  ఇక ఈ రంగంలో తాము విశ్వ‌స‌నీయ‌త కోస‌మే ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టి ప‌ని చేస్తున్నామ‌ని.. ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ రోజు ఉండి రేపు వెళ్లిపోయే వాళ్ల గురించి .. ఆ త‌ర్వాత మాయం అయ్యే వాళ్ల‌లాంటోళ్లం తాము కాద‌ని ప్ర‌వీణ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: