ఏపీ: సీఎం ఎవరో తేల్చేసిన ఏఐ.. ఎన్ని సీట్లు వస్తాయంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయంపై ఎప్పటికప్పుడు ఎన్నో సర్వేలు అంచనాలు వేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ అంచనాలన్నింటికీ దీటు గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా వేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2024 మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఏఐ తన అంచనాను ప్రకటించింది. మరి ఏఐ అంచనా మేరకు ఎవరు అధికారంలోకి వస్తారు అనే విషయానికి వస్తే.. మళ్లీ అధికారంలోకి వైఎస్ఆర్సిపి రాబోతోందని స్పష్టం అవుతుంది.
అయితే ఈసారి కూడా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది కానీ తక్కువ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తెలుస్తోంది.. దాదాపు 100-110  సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.. కానీ ఈసారి తక్కువ మెజారిటీతోనే ఆయన అధికారంలోకి రాబోతున్నారు. ఇక కూటమి  విషయానికి వస్తే.. టిడిపి, జనసేన, బిజెపి తన పనితీరును మెరుగుపరచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుంది . దాదాపు 80 నుండి 90 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ  10 నుండీ 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. కూటమిలో చిన్న పార్టీ అయినా ముఖ్యమైన భాగస్వామిగా ఉద్భవించనుంది.
 బిజెపి కూడా సొంత బలంతో ప్రధానమంత్రి మోడీ వేవ్ లో  5-7'సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రాంతీయ పరంగా అలాగే కులం ఆధారంగా పార్టీలు సమిష్టిగా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇకపోతే వైఎస్ఆర్సిపి కొన్నిచోట్ల కొన్ని సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకు గల కారణం ఏమిటి అంటే.. ఐదు సంవత్సరాల జగన్ పరిపాలన తర్వాత అధికార వ్యతిరేకత నెలకొనడం.. గత రెండు సంవత్సరాలుగా ప్రజలను ప్రభావితం చేస్తున్న అంశం పెరుగుతున్న ద్రవ్యోల్బణం మెరుగైన సమన్వయంతో కూడిన ప్రతిపక్ష ప్రచారం.. ఇలా ఇవన్నీ కూడా కొన్ని చోట్ల తక్కువ సీట్లు రావడానికి కారణం అవుతున్నాయి.. ఇంతటి గట్టి పోటీతో కూడిన ఎన్నికలలో వైఎస్ఆర్సిపి తక్కువ మద్యంతో అయినా సరే అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందని అంచనాలు వేసింది ఏఐ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: