మొటిమలతో చింతిస్తున్నారా?.. అయితే ఇలా చెక్ పెట్టండి..!

frame మొటిమలతో చింతిస్తున్నారా?.. అయితే ఇలా చెక్ పెట్టండి..!

lakhmi saranya
మొటిమలు  అన్న పదం వినగానే చాలామందికి అసహనంగా ఉంటుంది. ముఖ్యంగా యవ్వనంలో మొదలయ్యే ఈ సమస్య చాలా మందిని మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. ముఖంపై వచ్చిన ఒక్క మొటిమ కూడా ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చగలదు. అయితే మొటిమలు రావడానికి గల కారణాలు, వాటిని నివారించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, మరియు డాక్టర్లు సూచించే పరిష్కారాలు గురించి తెలుగులో పూర్తిగా తెలుసుకుందాం.మొటిమలు ఎందుకు వస్తాయో ముందుగా తెలుసుకోండి. చర్మం పొడిగా ఉన్నప్పుడు లేదా హార్మోన్ల ప్రభావంతో తైలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది రంధ్రాల్లో ఇరుక్కుపోయి మొటిమలుగా మారుతుంది. హార్మోన్ మార్పులు, ముఖ్యంగా టీనేజ్ లో, మెన్సట్రువల్ సైకిల్ సమయంలో, గర్భధారణ సమయంలో, లేదా PCOS వల్ల హార్మోన్ల అసమతుల్యత వలన మొటిమలు వస్తాయి.

ముఖం శుభ్రంగా లేకపోతే ధూళి, మురికి చర్మరంధ్రాల్లోకి చేరి మొటిమలకు దారితీస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం. చాక్లెట్, స్పైసీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి మొటిమల వృద్ధికి కారణమవుతాయి.మెకప్ ఎక్కువగా వాడటం, శుభ్రం చేయకపోవడం. కొంతమంది రాత్రి కూడా మేకప్ తోనే పడుకుంటారు – ఇది చర్మానికి చాలా హానికరం. రోజుకు కనీసం రెండు సార్లు మైల్డ్ ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి. చెమట వచ్చిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. టాక్సిన్స్ బయటకు పోతాయి.తక్కువ తైలం, తక్కువ మసాలాలు ఉన్న ఆహారం తీసుకోండి.

 తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. బాదం, వాల్‌నట్స్ లాంటివి చర్మానికి మేలు చేస్తాయి.ఇంటి చిట్కాలు ఉపయోగించండి. తాజా అలోవెరా జెల్ తీసుకొని మొటిమలపై అప్లై చేయండి. ఇది యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల చర్మాన్ని చల్లబరుస్తుంది, ఎర్రదనం తగ్గిస్తుంది. నిమ్మరసం మొటిమలపై వాడటం వల్ల బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. కానీ సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్తగా వాడాలి.నీము ఆకులను నానబెట్టి పేస్ట్ చేసి మొటిమలపై రాయండి. ఇది బాక్టీరియాను నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. రెండింటిని కలిపి ముఖానికి మాస్క్‌లా వాడితే చర్మం తాజా కనిపిస్తుంది, మొటిమలు తగ్గుతాయి. నోడ్యూల్స్ & సిస్టిక్ మొటిమలు – తీవ్రమైన రకాలు. ఈ రకాలను బట్టి చికిత్స మారుతుంది. తీవ్రమైన మొటిమలకి చర్మవైద్యుడి సలహా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: